Dilip Kumar Death News: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98) కన్నుమూశారు. ముంబైలోని పీడీ హిందూజ ఆసుపత్రిలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ మరణం పట్ల హిందీ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వయసురీత్యా బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
నేటి (జులై 7న) ఉదయం 7:30 గంటలకు దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారని పల్మనాలజిస్ట్, ప్రముఖ డాక్టర్ జలీల్ పార్కర్ మీడియాకు వెల్లడించారు. ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్(Bollywood)గా దిలీప్ కుమార్ పేరు గాంచారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగవుతుందని, చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని ఆయన భార్య, నటి సైరా బాను సోమవారం నాడు ట్వీట్ చేశారు. ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి రావాలని ఆమె ఆకాంక్షించారు. కానీ వయసురీత్యా చాలాకాలం నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దిలీప్ కుమార్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
Also Read: RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీలో మార్పు లేదా..అక్టోబర్ 13నే విడుదలా
Veteran actor Dilip Kumar passes away at the age of 98, says Dr Jalil Parkar, the pulmonologist treating the actor at Mumbai's PD Hinduja Hospital
(File pic) pic.twitter.com/JnmvQk8QIk
— ANI (@ANI) July 7, 2021
దాదాపు 6 దశాబ్దాలపాటు బాలీవుడ్ ప్రేక్షకులను దిలీప్ కుమార్ అలరించారు. దేవదాస్(1955), నయా దౌర్(1957), మొఘల్ ఈ అజమ్(1960), గంగా జమున(1961), క్రాంతి (1981), కర్మ (1986) లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి హిందీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook