Harihara Veeramallu: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. ఇక రచ్చ రచ్చే!

Bobby Deol in Harihara Veeramallu: బాబీ డియోల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు, హిందీలో పలు బడా ప్రాజెక్టులలో భాగమైన ఆయన తెలుగులో హరిహరవీరమల్లు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 9, 2022, 10:41 PM IST
Harihara Veeramallu: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. ఇక రచ్చ రచ్చే!

Bobby Deol in Harihara Veeramallu: కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తెలుగు సినిమాలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వేరే ఏదో ప్రాజెక్టులో భాగమవుతారని అందరూ భావిస్తూ వచ్చారు కానీ ఆసక్తికరంగా ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఎఎం రత్నం నిర్మాణంలో మెగా సూర్య మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా సహా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే వ్యక్తి జీవిత ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొగలాయిల కాలంలో వారిని ఎదిరించి మరీ పేదవారికి రాబిన్ హుద్ తరహాలో సంపద దోచిపెట్టిన వ్యక్తిగా సాయన్నకు పేరు ఉంది.

దాదాపు అదే పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలోనే పవన్ సహా సినిమా యూనిట్ అంతా పలు వర్క్ షాప్స్ నిర్వహించి షూటింగ్ కి సమాయత్తమైంది. ప్రస్తుతానికి పవన్ లేకుండానే పలు సీన్ల షూటింగ్ అయితే జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఆ పని పూర్తవుగానే షూటింగ్ కి హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇక బాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన బాబీ డియోల్ ఆశ్రమం అనే ఒక వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. డేరా బాబాగా నార్త్ లో బాగా ఫేమస్ అయిన బాబా రాం రహీమ్ సింగ్ ఆశ్రమం నేపథ్యంలో ఈ ఆశ్రమం వెబ్ సిరీస్ సాగుతోంది. ఇప్పటికే పలు సీజన్లు విడుదల కాగా అవన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత 2023 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలైతే భారీ ఎత్తున సిద్ధం చేసుకుంటున్నారు మేకర్స్.

Also Read: Ram Charan for Velpari: నక్కతోక తొక్కిన రామ్ చరణ్.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీలక పాత్ర?

Also Read: HIT 2 Teaser : ప్రభాస్ అన్నట్టు రొమాన్స్ కూడా ఉండాలి.. వాటిపై అడివి శేష్ క్లారిటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News