నటుడు Sonu Sood‌పై ఫిర్యాదు చేసిన బీఎంసీ, కబ్జా ఆరోపణలు సైతం!

BMC Files Complaint Against Sonu Sood: లాక్‌డౌన్ సమయంలో కార్మికులకు, దినసరి కూలీలకు, అట్టడుగు వర్గాల వారికి ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2021, 04:59 PM IST
  • లాక్‌డౌన్ సమయంలో ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్
  • తన ఇంటి విషయంలో నిబంధనలు ఉల్లంఘించి వివాదంలో నటుడు
  • సోనూ సూద్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఎంసీ
నటుడు Sonu Sood‌పై ఫిర్యాదు చేసిన బీఎంసీ, కబ్జా ఆరోపణలు సైతం!

BMC Files Complaint Against Sonu Sood: లాక్‌డౌన్ సమయంలో కార్మికులకు, దినసరి కూలీలకు, అట్టడుగు వర్గాల వారికి ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం ఏంటంటే.. ముంబైలో ఉన్న తన ఇంటికి సంబంధించి నటుడు సోనూ సూద్ నియమాలను ఉల్లంఘించారని ఆరోపణలు వస్తున్నాయి.

ముంబైలోని శక్తినగర్‌లో సోనూ సూద్‌కు ఆరంతస్తుల భవనం ఉంది. అయితే ఆ భవనాన్ని అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే హోటల్‌గా మార్పులు చేస్తున్నారట. ఇదే విషయంపై నిబంధనల ఉల్లంఘన కింద బీఎంసీ అధికారులు జుహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణం, భవనం మార్పులకు సంబంధి నిబంధనలు ఉల్లంఘించారంటూ నటుడు సోనూ సూద్‌(Sonu Sood)కు ఇదివరకే తాము నోటీసులు పంపినట్లుగా బీఎంసీ అధికారులు వెల్లడించారు.

Also Read: Tollywood డైరెక్టర్ మారుతితో గోపిచంద్ నెక్ట్స్ మూవీ.. ఇంట్రెస్టింగ్

 

తాము పంపిన నోటీసులపై Bollywood నటుడు సోనూ సూద్ నుంచి ఏ విధమైన స్పందన లేదని, దాంతో తాము చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా, ఇంటి సమీపంలో కొంత భూమిని సైతం సోనూ సూద్ కబ్జా చేశారని, ఆక్రమణకు సంబంధించి సైతం బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు జుహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్

 

కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై నటుడు సోనూ సూద్ స్పందించారు. తాను ఇంటిని హోటల్‌గా మార్చడం కోసం బీఎంసీ నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. అయితే పర్మిషన్‌కు సంబంధించిన విషయం మహారాష్ట్ర కోస్టల్ అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సోనూ సూద్.. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆచార్య షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

Also Read: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News