Bimbisara Collections: దుమ్మురేపిన కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ లో సగం టార్గెట్ పూర్తి చేసిన బింబిసార

  Bimbisara Movie Day 1 Collections:  ఆగస్టు 5న విడుదలైన కళ్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఆ సినిమాలు మొదటి రోజు ఎంత వసూళ్లు చేశాయో పరిశీలిద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2022, 12:29 PM IST
Bimbisara Collections: దుమ్మురేపిన కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ లో సగం టార్గెట్ పూర్తి చేసిన బింబిసార

Bimbisara Movie Day 1 Collections: చాలా కాలం తరువాత కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వశిష్ట అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో సంయక్త మీనన్, క్యాథరిన్ థెరీసా హీరోయిన్లుగా నటించగా వరీనా హుసేన్ ఒక ఐటెం సాంగ్ లో నటించింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజూ ఏరియాల వారీగా చూస్తే నైజాం: 2.15 కోట్లు, సెడెడ్: 1.29 కోట్లు, ఉత్తరాంధ్ర : 90 లక్షలు, తూర్పు: 43 లక్షలు, పశ్చిమం: 36 లక్షలు, గుంటూరు: 57 లక్షలు, కృష్ణ: 34 లక్షలు, నెల్లూరు: 26 లక్షలు వసూలు చేసింది. మిగతా భారత దేశం మొత్తం 32 లక్షలు, ఓవర్సేస్ లో 65 లక్షలు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 7.27 కోట్ల షేర్, 11.50 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 15. 60 కోట్లు చేయడంతో బ్రేక్ ఈవెన్ 16.20 కోట్లుగ ఫిక్స్ అయింది. ఇంకా 8.93 కోట్లు సాధిస్తే హిట్ కొట్టినట్టే. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించవచ్చు. 

Sita Ramam Movie Day 1 Collections: ఇక మరో మూవీ సీతారామం కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కించారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బింబిసారతో భారీ పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓవర్సీస్‌లో సీతా రామం మంచి ఆధిక్యాన్ని చూపినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో బింబిసార పూర్తి ఆధిక్యత కనపరిచింది. 

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు 2 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేసినా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ మార్క్‌ను అయితే దాటలేక పోయింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఏరియా వారీగా పరిశీలిస్తే  నైజాం: 54 లక్షలు, సీడెడ్: 16 లక్షలు, UA: 23 లక్షలు, తూర్పు: 15 లక్షలు, పశ్చిమ: 8 లక్షలు, గుంటూరు: 16 లక్షలు, కృష్ణ: 13 లక్షలు, నెల్లూరు: 5 లక్షలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్లు షేర్ 2.25 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక మిగతా భారత దేశంలో 15 లక్షలు, మిగతా భాష్లలో 35 లక్షలు, ఓవర్సీస్ 1.05 కోట్లు వసూలు చేసింది. మొత్తమ్మీద 3.05 కోట్లు, 5.60 గ్రాస్ వసూలు చేసింది. 
 
నోట్ : మేము ప్రచురించిన ఈ బాక్స్ ఆఫీస్ డేటా వివిధ మూలాల నుండి సేకరించబడింది. మేము ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. అయితే మీకు సరైన సమాచారాన్ని అందించడానికి ప్రతి ప్రయత్నం చేస్తాము. కానీ ఈ డేటా ప్రామాణికతకు మేము ఏ విధమైన బాధ్యత వహించము.

Also Read: Deepika Padukone: ఎన్నో సార్లు సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా.. అమ్మ లేకుంటే అదే జరిగేది.. దీపికా సంచలనం!

Also Read: Bimbisara: అప్పట్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బింబిసార డైరెక్టర్.. ఏ సినిమానో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News