Siri Eliminated Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన సిరి!

Siri Eliminated Bigg Boss 5: మరో రెండు రోజుల్లో ముగియనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పోటీదారులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సిరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించగా.. ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 05:45 PM IST
    • బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఊహించని ట్విస్ట్
    • సిరి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటన
    • ఒక్కసారిగా షాక్ గురైన బిగ్ బాస్ ఇంటి సభ్యులు
Siri Eliminated Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన సిరి!

Siri Eliminated Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో పోటీదారులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మరో రెండు రోజుల్లో ముగియనున్న బిగ్‌బాస్‌ సీజన్‌-5 లోని కంటెస్టెంట్ సిరి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అది విన్న బిగ్ బాస్ హౌస్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. సిరి సన్నిహితుడైన షణ్ముఖ్.. ఆమె ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోతున్నాడు. 

బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం.. ఇంటి సభ్యులందరూ తమ బట్టలు సర్దుకుని గార్డెన్‌ ఏరియాకు రమ్మని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. "ఈ ఇంట్లో మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది. బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారు" అని అడిగాడు. మానస్.. షణ్ముఖ్ పేరు ప్రస్తావించగా, మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు కాలేదంటూ సన్నీకూడా పేరును షణ్ముఖ్ సూచించాడు. 

సింగర్ శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. "హౌస్‌మేట్స్‌ అనగానే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్‌ ముఖ్యం. ఉన్న నలుగురిలో సిరితో నాకు ఇంటరాక్షన్‌ తక్కువ. కాబట్టి ఆమెనే అనుకుంటున్నా" అని శ్రీరామ్‌ అన్నాడు. 

అందరి అభిప్రాయాలు విన్న బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి 'సిరి' అని చెప్పాడు. దీంతో సిరి కంగుతింది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లనని అంది. డోర్లు ఓపెన్‌ చేయడంతో సిరి, షణ్ముఖ్ బాధపడుతూ కనిపించారు. మరి సిరి నిజంగానే బయటకు వెళ్లిందా? లేదా ఏదైనా టాస్కా? సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారా? తెలియాల్సి ఉంది.  

ALso Read: Bheemla Nayak Shooting : భీమ్లా నాయక్ షూటింగ్‌ స్పాట్‌లో పవన్ ఫ్యాన్స్ సందడి..

Also Read: RRR Pre Release Event: ముంబయి వేదికగా ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News