Bigg Boss Telugu Season 6 Update: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఎప్పుడో తెలుసా

Bigg Boss Telugu Season 6 Update: ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. అత్యంత ఆర్భాటంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా సన్నీ నిలిచాడు. మరి ప్రేక్షకుల సంగతేంటి..అందుకే బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున అప్పుడే ఆ ప్రకటన కూడా చేసేశాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2021, 10:36 AM IST
  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 పై నాగార్జున సర్‌ప్రైజింగ్ అప్‌డేట్
  • 2022 మార్చ్‌లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభం కానుందని వెల్లడించిన నాగార్జున
  • అత్యంత వైభవంగా ముగిసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే
Bigg Boss Telugu Season 6 Update: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఎప్పుడో తెలుసా

Bigg Boss Telugu Season 6 Update: ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. అత్యంత ఆర్భాటంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా సన్నీ నిలిచాడు. మరి ప్రేక్షకుల సంగతేంటి..అందుకే బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున అప్పుడే ఆ ప్రకటన కూడా చేసేశాడు.

బుల్లితెరపై 15 వారాలపాటు దిగ్విజయంగా సాగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5(Bigg Boss Telugu Season 5)అయిపోయింది. విజేత ఎవరనే ఉత్కంఠ తొలగింది. అందరి మనసుల్ని గెల్చుకున్న వీజే సన్నీ విజేతగా నిలిచాడు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు అతిరధ మహామహులు తరలివచ్చారు. బాహుబలి దర్శకుడు రాజమౌళి, రణవీర్‌కపూర్, అలియా భట్, కృతిశెట్టి, ఫరిహా అబ్దుల్లా, నాని, నాగ చైతన్య, సాయి పల్లవి, రష్మికా మందన్నా ఇలా ఎందరో సెలెబ్రిటీలతో కన్నుల పండుగగా జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులకు మంచి అనుభూతినే మిగిల్చింది. అదే సమయంలో ఇన్నాళ్లూ అలరించిన బిగ్‌బాస్ షో ముగిసిపోవడంతో..నిరాశ కూడా ఆవహించింది.

అందుకే బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున(Nagarjuna)ప్రేక్షకుల కోసం ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ అదే వేదికపై నుంచి ప్రకటించేశాడు. విన్నర్, రన్నర్‌లను ప్రకటించిన కాస్సేపటికే నెక్ట్స్‌ సీజన్ ఎప్పుడనేది చెప్పేశారు. సాధారణంగా ఒక సీజన్‌కు మరో సీజన్‌కు 5-8 నెలలు గ్యాప్ ఉంటుంది. ఈసారి మాత్రం బిగ్‌బాస్ ప్రేక్షకులకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6(Bigg Boss Telugu Season 6)ఎప్పుడనే గుడ్‌న్యూస్ అందించారు. ఈసారి బిగ్‌బాస్ 6 ను త్వరలో ప్రారంభించనున్నట్టు నాగార్జున తెలిపారు. కొత్త సంవత్సరం మొదలైన 2 నెలలకు బిగ్‌బాస్ కొత్త సీజన్ ఉంటుందని నాగార్జున ప్రకటించారు. అంటే మార్చ్ 2022 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభం కానుంది. తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా బిగ్‌బాస్(Bigg Boss)అభిమానులకు ఇది గుడ్‌న్యూస్.

Also read: Bigg Boss Winner Sunny Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ పారితోషికం ఎంత, సంపాదన ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News