Bigg Boss Telugu 8: టైటిల్ విన్నర్ వారే అంటూ బాంబ్ పేల్చిన బేబక్క. ఊహించలేదుగా..?

Bigg Boss Telugu 8 Daily Update: బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా  హౌస్ లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె విష్ణు ప్రియ టైటిల్ విన్నర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొవచ్చింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 12, 2024, 01:14 PM IST
Bigg Boss Telugu 8: టైటిల్ విన్నర్ వారే అంటూ బాంబ్ పేల్చిన బేబక్క. ఊహించలేదుగా..?

Bigg Boss Telugu 8 Winner: తెలుగులో బిగ్ బాస్ ఏడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని , ఒక ఓటీటీ సీజన్ ను కూడా పూర్తిచేసుకుంది.  ఇప్పుడు 8వ సీజన్ ప్రారంభం అవ్వగా అందులో భాగంగానే రెండవ వారం కూడా పూర్తి కావస్తోంది.  ప్రస్తుతం మొదటివారం ఎలిమినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ వారం కూడా కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి 

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన.. బెజవాడ బేబక్క.. పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తాను ఇంత త్వరగా హౌస్ నుంచి బయటకు రావడానికి గల కారణాలను చెప్పలేకపోతున్నాను అంటూ చెప్పుకోస్తోంది. అంతేకాదు టైటిల్ విన్నర్ వారే అంటూ అప్పుడే జ్యోతిష్యం చెప్పేస్తోంది ఈ ముద్దుగుమ్మ. 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబక్క మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు విష్ణుప్రియ, సీత అంటే చాలా ఇష్టమని, వారితో బాండింగ్ బాగా ఏర్పడిందని ఆమె తెలిపింది. అంతేకాదు టాప్ ఫైవ్ లో.. వీరిద్దరికి చోటు దక్కేలా చూసుకోవాలని కూడా ఆమె కోరింది. ఎందుకంటే తెలుగు అమ్మాయిలని , తెలుగు వారికి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి తెలుగు అమ్మాయిలు కష్టపడి ఆడుతున్నప్పుడు వారిని ఎంకరేజ్ చేయాలి అంటూ తన వంతుగా చెప్పుకొచ్చింది బెజవాడ బేబక్క.

ఇకపోతే టాప్ ఫైవ్ లోనే కాదు టైటిల్ విన్నర్ గా వీరిద్దరిలో ఏ ఒక్కరు ఉన్నా కూడా తనకు సంతోషమే అని.. ముఖ్యంగా విష్ణు ప్రియ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బెజవాడ బేబక్క చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News