Samantha: బిగ్‌బాస్ 4 గెస్ట్ హోస్ట్‌ సమంత.. మామ నాగార్జునతో మార్కులు కొట్టేస్తుందా?

Samantha as host for Bigg Boss Telugu 4 Dusshera Special Episode | ఈ వారం స్పెషల్ హోస్ట్ స్టార్ మా ‘బిగ్‌బాస్ తెలుగు 4’ దసరా ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. అనూహ్యంగా అక్కినేని వారి కోడలు టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని (Samantha Akkineni) బిగ్‌బాస్ తెలుగు 4 గెస్ట్ హోస్ట్‌గా దసరా ఈవెంట్‌లో పాల్గొననున్నారు.

Last Updated : Oct 25, 2020, 07:39 AM IST
  • బిగ్‌బాస్ తెలుగు 4వ సీజన్ వ్యాఖ్యాతగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున
  • కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ ‌లో బిజీగా గడుపుతున్నారు
  • గెస్ట్ హోస్ట్‌గా దసరా ఈవెంట్‌లో పాల్గొననున్న అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని
Samantha: బిగ్‌బాస్ 4 గెస్ట్ హోస్ట్‌ సమంత.. మామ నాగార్జునతో మార్కులు కొట్టేస్తుందా?

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ వ్యాఖ్యాతగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Bigg Boss Telugu 4 Host Nagarjuna)  వ్యవహరిస్తున్నారు. మూడో సీజన్‌ను సైతం విజయవంతంగా ఆయనే నడిపించారని తెలిసిందే. నాగార్జున బదులుగా ఈ వీకెండ్ ఆదివారం రోజు స్పెషల్ హోస్ట్ బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) కంటెస్టెంట్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా గడుపుతున్నారు. దీంతో ఈ వారం స్పెషల్ హోస్ట్ స్టార్ మా ‘బిగ్‌బాస్ తెలుగు 4’ దసరా ఎపిసోడ్‌ (Bigg Boss Telugu 4 Dusshera Episode)లో సందడి చేయనున్నారు.

 

గతంలో బిగ్‌బాస్ తెలుగు 3వ సీజన్‌లో సైతం నాగార్జున షూటింగ్ కారణంగా విదేశాలకు వెళ్లాల్సి రావడంతో గెస్ట్ హోస్ట్‌గా శివగామి ‘రమ్యకృష్ణ' వ్యవహరించారు. చాలా హుందాగా షోను నడిపించి బిగ్‌బాస్ ప్రేక్షకుల మెప్పుపొందారు. నాగార్జున అందుబాటులో లేకపోవడంతో తొలుత రోజా పేరు ప్రచారం జరిగింది. ఆపై రోజా కాదు జగపతిబాబు ఈ వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్‌గా చేశారని వదంతులు వ్యాపించాయి. చివరికి అనూహ్యంగా అక్కినేని వారి కోడలు టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని (Samantha Akkineni) బిగ్‌బాస్ తెలుగు 4 గెస్ట్ హోస్ట్‌గా దసరా ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఈ మేరకు స్టార్ మా తమ ట్విట్టర్‌లో ప్రోమోలు సైతం పోస్ట్ చేసి బిగ్‌బాస్ షోకు మరింత హైప్ తీసుకొచ్చారు.

 

 

మరోవైపు ఈ ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియను సమంత ఏ విధంగా డీల్ చేయనున్నారనే దానిపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. డైరెక్టుగా నామినేట్ అయిన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ నోయల్‌తో పాటు మొనాల్ గజ్జర్, అభిజీత్, అవినాష్, దివి, అరియానా 7వ వారం నామినేట్ అయిన సభ్యులు. గత వారం సేఫ్ అయిన మొనాల్ గజ్జర్ ఈరోజు ఎలిమినేట్ అవుతుందని బిగ్‌బాస్ 4 తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. వారి ఓట్లకు విలువ ఉంటుందో లేదో ఈరోజు ఎపిసోడ్ ద్వారా తేలనుంది.

కాగా, నేడు దసరా పండుగను పురస్కరించుకుని బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్‌లో పండుగ సందడి కనిపించనుంది. రెగ్యూలర్ టైమ్‌లో కాకుండా నేడు దసరా పండుగ సందర్భంగా (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్ షో ప్రారంభమవుతుంది. దాదాపు 3 గంటలపాటు తమ ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ 4 హౌస్‌లో దసరా వేడుకలతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. నేటి షోలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సందడి చేయనున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News