Mister Pregnant OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mister Pregnant Movie: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా న‌టించిన మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 07:00 PM IST
Mister Pregnant OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'మిస్టర్ ప్రెగ్నెంట్'..  స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mister Pregnant OTT Release Date: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో నటించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'(Mister Pregnant). ఆగ‌స్ట్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మగాడికి ప్రెగ్నెన్సీ వ‌స్తే ఎలా ఉంటుంద‌నే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. 

ఈ మూవీకి శ్రీనివాస్ వింజ‌నంపాటి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన స్క్రీన్‍ప్లే కూడా అందించారు. ఈ చిత్రంలో సోహెల్ సరసన రూపా కొడువాయూర్ నటించింది. ఈ మూవీలో సుహాసిని మణిరత్నం, రజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష, అభిషేక్ రెడ్డి, స్వప్నిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 

టాటూ ఆర్టిస్ట్ అయిన గౌతమ్, మహీ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మ‌హిపై ప్రేమ‌తో ఆమె గ‌ర్భాన్ని తాను మోయాల‌ని అనుకుంటాడు గౌత‌మ్‌. సైంటిఫిక్‌గా అది సాధ్య‌మా? గౌత‌మ్ బిడ్డ‌ను క‌న్నాడా? ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. బిగ్‌బాస్ సీజ‌న్‌4తో సోహెల్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వచ్చాక ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌, ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు సినిమాల్లో హీరోగా న‌టించాడు. ఈ సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. 

Also Read: Bigg Boss 7 Telugu Voting: ఓటింగ్ లో దూసుకుపోతున్న శివాజీ... అట్టడుగున సీరియల్ బ్యాచ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News