Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ సీజన్ 7 సీక్రెట్ రివీల్ చేసిన కింగ్ నాగార్జున..

Bigg Boss Season 7: ఫేమస్ రియాల్టీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేశారు కింగ్ నాగార్జున. ఆయన ఏమన్నారంటే...

Written by - Samala Srinivas | Edited by - Samala Srinivas | Last Updated : Jul 24, 2023, 10:37 AM IST
Bigg Boss 7 Telugu:  బిగ్‏బాస్ సీజన్ 7 సీక్రెట్ రివీల్ చేసిన కింగ్ నాగార్జున..

Bigg Boss 7 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మెగా షో.. ఇప్పుడు ఏడో సీజన్ (Bigg Boss 7 Telugu) కు రెడీ అయింది. సోషల్ మీడియాలో ఇప్పటికే సీజన్ 7 సందడి షురూ అయింది. రీసెంట్ గా షోకు సంబంధించిన లోగో పోస్టర్, టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. షో హోస్ట్ చేసేది ఎవరనేది రివీల్ చేశారు. ఈసారి కూడా బిగ్ బాస్ వ్యాఖ్యాతగా కింగ్ నాగార్జునే వ్యవహారించనున్నారు. 

టీజర్ లో 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటూ పాట పాడి సస్పెన్స్ క్రియేట్ చేశారు నాగార్జున. తాజాగా దీనికి సమాధానమిచ్చారు నాగ్. త్వరలో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. 'బిగ్‏బాస్ షైనింగ్ స్టార్స్' పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. గత ఆరు సీజన్లలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ ఈ వేదికపై సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. 

Also read: Nithiin latest Movie: డిఫరెంట్ లుక్‍తో 'ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్'గా వచ్చేసిన నితిన్..!

ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహారించగా. నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సుమ నాగ్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు.. దానికి అర్థం ఏమిటి అని నాగార్జునను అడగ్గా.. 'న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూరూల్స్' అంటూ చెప్పుకొచ్చారు కింగ్. దీంతో ఈసారి బిగ్ బాస్  సీజన్ 7 సరికొత్తగా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. అయితే ఈసారి ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట చక్కెర్లు కొడుతుంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Also read: Indian 2 Update: ఇండియన్‌ 2లో సరికొత్త టెక్నాలజీ.. నయా ప్లాన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న శంకర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News