బిగ్ బాస్ ఓటిటి కంటెస్టంట్స్ జాబితా విడుదల.. అక్షర సింగ్ ఓటిటి ఎంట్రీ

Bigg Boss OTT contestants list: బిగ్ బాస్ 15 రియాలిటీ షో ఈసారి టీవీలో ప్రసారం కావడానికంటే ముందుగా మొదటి ఆరు వారాల ఎపిసోడ్స్ వూట్ ప్లాట్ ఫామ్ పై ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఓటిటి పేరుతో వూట్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోకు కరణ్ జొహర్ (Karan Johar) హోస్ట్ చేస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2021, 07:37 PM IST
బిగ్ బాస్ ఓటిటి కంటెస్టంట్స్ జాబితా విడుదల.. అక్షర సింగ్ ఓటిటి ఎంట్రీ

Bigg Boss OTT contestants list: బిగ్ బాస్ 15 రియాలిటీ షో ఈసారి టీవీలో ప్రసారం కావడానికంటే ముందుగా మొదటి ఆరు వారాల ఎపిసోడ్స్ వూట్ ప్లాట్ ఫామ్ పై ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఓటిటి పేరుతో వూట్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోకు కరణ్ జొహర్ (Karan Johar) హోస్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 8 నుంచి లాంచ్ కానున్న బిగ్ బాస్ ఓటిటిలో కనిపించనున్న కొంత మంది కంటెస్టంట్స్ పేరుని వూట్ వెల్లడించింది. ప్రముఖ సింగర్ నేహా భాసిన్, నటీనటులు జీషాన్ ఖాన్, కరణ్ నాథ్, అక్షర సింగ్ లాంటి సెలబ్రిటీలు ఆ జాబితాలో ఉన్నారు.

Bigg Boss OTT contestants list revealed: బిగ్ బాస్ ఓటిటిలో కనిపించనున్న ఇతర సెలబ్రిటీల జాబితా ఇలా ఉండనుందని తెలుస్తోంది.
1) నేహా భాసిన్
2) జీషాన్ ఖాన్
3) కరణ్ నాథ్
4) అక్షర సింగ్
5) దివ్య అగర్వాల్
6) నిశాంత్ భట్
7) రాకేష్ భాపట్
8) రిథిమ పండిట్
9) మిలింద్ గబ
10) ప్రతీక్ సెహజ్‌పాల్

వీళ్లందరిలో ముందుగా నేహా భాసిన్ పేరు ఖరారైంది. వూట్ యాప్‌పై (Voot app) బిగ్ బాస్ ఓటిటి పూర్తయిన అనంతరం బిగ్ బాస్ 15 టీవీ షోను సల్మాన్ ఖాన్ (Salman Khan) కంటిన్యూ చేయనున్నాడు. బిగ్ బాస్ 15 కంటెస్టంట్స్‌లో (Bigg Boss OTT contestants list) ఈసారి బోజ్‌పురి నటి అక్షర సింగ్ (Actress Akshara Singh) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Trending News