BiggBoss Telugu 7 Promo 2 - Day 38: బిగ్ బాస్ ప్రోమోలతో షాకిస్తున్నాడు. మార్నింగ్ ప్రోమోలో రైతుబిడ్డ ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ ను తీసేసుకున్నట్లు చూపించగా.. తాజా ప్రోమోలో హౌస్ మేట్స్ పరుగులు పెట్టడం చూపించాడు. ఇక లేటెస్ట్ ప్రోమో విషయానికొస్తే.. కంటెస్టెంట్లకు కలర్ కలర్ విచ్ కలర్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆటగాళ్లు, పోటుగాళ్లకు మధ్య ఈ టాస్క్ పెట్టాడు. ఈ టాస్కులో భాగంగా బిగ్‌బాస్ చెప్పిన కలర్ ఉన్న వస్తువులు ఇంట్లో నుంచి తీసుకువచ్చి బయట వెయ్యాల్సి ఉంటుంది. ముందుగా కలర్ కలర్ విచ్ కలర్ బిగ్‌బాస్.. అని అడగ్గా.. ఆయన గ్రీన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే ఉన్న పచ్చగడ్డిని తీసి బాక్స్ లో వేస్తుంది అశ్విని. దీంతో ఆమె వేసిన వస్తువును గుర్తించి చూపించాలని కోరుతాడు బిగ్ బాస్. అయితే తను వేసిన వస్తువును తనే చూపించలేకపోతుంది.
ఆ తర్వాత లెమన్ కలర్ అని బిగ్ బాస్ చెప్పగా. సందీప్ గ్రీన్, అర్జున్ అంబటి ఎల్లో చైర్స్ తీసుకొస్తారు. దీంతో మీరిద్దరూ స్కూల్లో కలర్స్ సరిగ్గా నేర్చుకోలేదంటూ కౌంటరిస్తాడు పెద్దయ్య. అనంతరం పెద్ద స్పూన్ తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పగా.. అశ్విని, అమర్ దీప్ స్పూన్స్ తీసుకొస్తారు. దీంతో ఈ రెండు స్పూన్లలో దేనితో ముందుగా స్విమ్మింగ్ పూల్ ను ఖాళీ చేయెుచ్చు అని బిగ్ బాస్ అడగ్గా.. తన చేతిలో ఉన్న స్పూన్ తో ఖాళీ చేయెుచ్చు అంటాడు అమర్ దీప్. అయితే నీ చేతిలోని స్పూన్ తో స్విమ్మింగ్ ఫూల్ ఖాళీ చేయ్ అంటాడు పెద్దయ్య. దీంతో అమర్ షాక్ తింటాడు. అయితే చేసేది ఏమీ లేక స్పూన్ తో స్విమ్మింగ్ ఫూల్ లోని నీటిని బయట పోసేందుకు ప్రయత్నిస్తాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి