Bigg Boss 7 Telugu: హౌస్ లోకి గౌతమ్ రీ ఎంట్రీ.. వచ్చి రాగానే హౌస్ మేట్స్ పై ఫైర్..!

BB 7 Updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. సీక్రెట్ రూమ్ కు వెళ్లిన గౌతమ్ తిరిగొచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 05:09 PM IST
Bigg Boss 7 Telugu: హౌస్ లోకి గౌతమ్ రీ ఎంట్రీ.. వచ్చి రాగానే హౌస్ మేట్స్ పై ఫైర్..!

Bigg Boss 7 Gautham Re Entry Promo: బిగ్ బాస్ సీజన్ 07 ఊహించని ట్విస్టులతో ముందుకు సాగుతోంది. ఐదోవారం డబల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చి.. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపించేశాడు నాగార్జున. ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్ లో ఉంటూ అందరినీ గమనించిన గౌతమ్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ ప్రోమో రిలీజ్ చేశారు. హౌస్ లోకి అడుగుపెట్టగానే అందరికీ ఇచ్చే పడేశాడు గౌతమ్. ''రానన్నుకున్న రాలేనాకున్నారా..? అశ్వథామ ఈజ్ బ్యాక్.. మీరందరూ తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు .. అయినా ఈ అశ్వథామ చావడు'' అని భారీ డైలాగ్ చెబుతూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. 

వచ్చి రాగానే శివాజీతో గొడవకు దిగాడు. ''నన్ను ఎలిమినేట్ చేసే సమయంలో గౌతమ్ ఎంటర్టైన్ చేయలేడు అని అన్నారు. ఎంటర్టైన్ చేయడం అంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదా అన్న'' అని అన్నాడు. ''నేను వంద సినిమాల్లో చేశాను. నేను యాక్టర్ ను నేను ఏదైనా చేస్తా'' అని శివాజీ కౌంటర్ వేశాడు.  ఇక చివరిలో బిగ్ బాస్ గౌతమ్ కు ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న వారిలో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయమని అన్నాడు. దాంతో గౌతమ్ ఎవరిని నామినేట్ చేస్తాడా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే శుభ శ్రీ ఎలిమినేట అయిన తర్వాత ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిలో అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని, సింగర్ భోల్, హీరోయిన్ అశ్వినీ ఉన్నారు. కొత్త వారు హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్రెస్ట్రింగ్ గా సాగింది. వీరిని పోటుగాళ్లుగా, పాతవారిని ఆటగాళ్లుగా డివైడ్ చేస్తూ నామినేషన్స్ ప్రక్రియను కొనసాగించమన్నారు బిగ్ బాస్. ముందుగా పోటుగాళ్లను ఆటగాళ్లలో ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. ఐదు వారాల ఆట చూసొచ్చిన పోటుగాళ్లలో ఎక్కువ మంది అమర్ దీప్ నే నామినేట్ చేశారు. తేజాను కూడా కొంత మంది నామినేట్ చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News