Bigg Boss 5: బిగ్‌‌బాస్ 5 విన్నర్ సన్నీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే..? సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్

Bigg Boss 5 Title Winner: బిగ్‌బాస్ 5 సీజన్ తుది అంకానికి కౌంట్ డౌన్ మొదలవడంతో టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై అటు ప్రేక్షకుల్లో, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సన్నీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 07:52 PM IST
  • బిగ్‌బాస్ విన్నర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ
  • టైటిల్ విన్నర్‌పై బెట్టింగ్ దందాలు
  • సన్నీనే విజేత అంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్
  • బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే..? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటో!
Bigg Boss 5: బిగ్‌‌బాస్ 5 విన్నర్ సన్నీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే..? సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్

Bigg Boss 5 Title Winner: బిగ్‌‌బాస్-5 సీజన్ చివరి అంకానికి కౌంట్ డౌన్ మొదలైంది. గ్రాండ్ ఫినాలేకి (Bigg Boss Grand Finale) మరో 9 రోజులే ఉండటంతో విజేత ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా... టైటిల్ ఫైట్ సన్నీ, షణ్ముఖ్ మధ్యే అని ఇప్పటికే చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఇక సన్నీ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి... బిగ్‌బాస్ 5 విజేత సన్నీనే (Bigg Boss Winner) అంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఆ ఫోటోలో హోస్ట్ నాగార్జున (Nagarjuna) సన్నీ విన్నర్ అనే దానికి సంకేతంగా... అతని చేతిని పైకెత్తి చూపించడం గమనించవచ్చు. సన్నీపై అభిమానంతో అతని అభిమానులు ఈ ఫోటోను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. సన్నీ ఎటువంటి దాపరికాలు లేకుండా ఫెయిర్‌ గేమ్ ఆడాడని... కాబట్టి టైటిల్ విన్నర్ అతడేనని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. పబ్లిక్‌లోనూ సన్నీనే విన్నర్‌గా నిలుస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌పై  (Bigg Boss Title Winner) బెట్టింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. టైటిల్ పోరులో అంతిమ విజేత ఎవరనే దానిపై యూత్ బెట్టింగ్స్‌కి పాల్పడుతున్నారు. తాజాగా పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది.

ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీ, షణ్ముఖ్‌, కాజల్‌, శ్రీరామ్‌, మానస్‌, సిరి ఉన్నారు. ఈ వారంలో ఒకరు హౌస్ (Bigg Boss) నుంచి ఎలిమినేట్ అవుతారు. చివరగా హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగులుతారు. వచ్చే ఆదివారం (డిసెంబర్ 19) ఈ ఐదుగురిలో విజేత ఎవరనేది ప్రకటిస్తారు.ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీ, షణ్ముఖ్‌, కాజల్‌, శ్రీరామ్‌, మానస్‌, సిరి ఉన్నారు. ఈ వారంలో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. చివరగా హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగులుతారు. వచ్చే ఆదివారం (డిసెంబర్ 19) ఈ ఐదుగురిలో విజేత ఎవరనేది ప్రకటిస్తారు. ఇక బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. షణ్ముక్ సింగం సూర్యలా, సిరి జెనీలియాలా, కాజల్ అతిలోక సుందరి శ్రీదేవిలా, సన్నీ బాలయ్యలా, మానస్ గబ్బర్ సింగ్‌లా, శ్రీరామ్ ముఠా మేస్త్రిలా అలరిస్తున్నారు. ముఖ్యంగా తన అంగులీకం కనిపించట్లేదంటూ కాజల్ హౌస్ సభ్యులను ఆరా తీయడం... షణ్ముఖ్ ఆమెను గద్దిండచడం... ఆపై బాలయ్య జోక్యం... ఇంతలో సిరి షణ్ముఖ్‌ను హగ్ చేసుకోవడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

Also Read: Funny Video: ఆటోమేటిక్‌గా కదిలిన సూట్‌కేస్.. ఇదేం విడ్డురంరా అయ్యా.. ఎవరో లాగినట్టు ఉరికింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News