Bigg Boss 5 Telugu: అరేయ్ ఏంట్రా ఇదీ! సిరి చేత కన్నీళ్లు పెట్టించిన షణ్నూ..ఏం జరిగిందంటే..

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందా.. అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకు ఎక్కువవుతుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో తనతో ఎందుకు మాట్లాడటం లేదని షణ్మూని సిరి నిలదీసింది. తర్వాత ఏం జరిగిందంటే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 06:51 PM IST
  • బిగ్ బాస్ 5 లేటేస్ట్ ప్రోమో రిలీజ్
  • షణ్మూని నిలదీసిన సిరి
  • నీతో ఫ్రెండ్ షిప్ ఇంట్రెస్ట్ లేదన్న షణ్మూ
Bigg Boss 5 Telugu: అరేయ్ ఏంట్రా ఇదీ! సిరి చేత కన్నీళ్లు పెట్టించిన షణ్నూ..ఏం జరిగిందంటే..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌(Bigg Boss 5 Telugu)పై ప్రేక్షకుల్లో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఇంట్లో నుంచి సరయు, ఉమాదేవి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేశారు. ఇక హౌస్‌లో మిగిలిన 17మంది గేమ్‌పై సీరియస్‌ ఫోకస్‌ పెట్టారు. ఫ్రెండ్‌షిప్‌ని పక్కకు పెట్టి సొంతంగా గేమ్‌ ఆడుతున్నారు.

షణ్ముఖ్‌, సిరి బయట ఎంత మంచి ఫ్రెండ్సో మనకు తెలిసిన విషయమే. ఇంట్లో కూడా వారు తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇంట్లో జరుగుతున్న వరుస పరిణామాలతో షణ్నూ మాత్రం సిరికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని జెస్సీతో కూడా చెప్పాడు. అనుకున్నట్లే సిరిని షణ్ముఖ్‌(Shanmukh)  దూరం పెట్టినట్లు తాజా ప్రోమో(bigg boss 5 latest promo) చూస్తే అర్థమవుతోంది.

Bigg Boss Telugu 5 : లహరి, శ్రీరామ్‌ల పెళ్లి టాస్క్ పూర్తవ్వగానే బ్యాడ్ న్యూస్, శ్వేత, షణ్ముఖ్‌ల స్కెచ్‌ ఫ్లాప్‌?

తాజాగా విడుదలైన ప్రోమోలో సిరి, షణ్నూల మధ ఆసక్తికర చర్చ జరిగింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని షణ్ముఖ్‌(Shanmukh)ని నిలదీసింది సిరి. దానికి వద్దులే అంటు తప్పించుకునే ప్రయత్నం చేశాడు షణ్నూ. అయినప్పటికీ సిరి అతన్ని వదలలేదు. ‘నువ్వు మాట్లాడకపోతే చాలా లోన్లీ ఫీలింగ్‌ ఉంది’అని సిరి అంటే.. ‘ఫీల్‌ అవరా లోన్లీగా.. టూ వీక్స్‌కి అలావాటైపోద్ది’అని సిరి ముఖం మీదే చెప్పేశాడు. అయినా సిరి(Siri Hanmanth) వదల్లేదు. దీంతో ‘పోరా.. నేను అనవసరంగా నోరు జారుతా’ అని షణ్నూ స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తే.. తిట్టినా పర్లేదని క్యూట్‌ గా చెప్పింది సిరి. . అయినా సరే షణ్ముఖ్ సిరిని దూరం పెట్టాడు. 

ఒకదశలో ‘నీతో ఫ్రెండ్‌షిఫ్‌ చేయడం ఇంట్రెస్ట్‌ లేదు’ అని షణ్నూ సిరి ఫేస్‌ మీదే అనేశాడు. దీంతో బాగా హర్ట్‌ అయిన సిరి.. దూరంగా వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు కెస్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు  స్విమ్ జరా స్విమ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమింగ్ పూల్‌లో ఉన్న అక్షరాలను టేబుల్ పై సెట్ చేయమని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News