Bigg Boss Anchor Ravi issue : యాంకర్‌‌ రవి, లహరి మిడ్‌నైట్‌ హగ్‌ ఇష్యూపై నిత్య పోస్ట్, కెప్టెన్సీ కోసం సీక్రెట్ టాస్క్, ప్రియను ఎలిమినేట్ చేయాలని డిసైడ్‌

Bigg Boss 5 Telugu : అర్ధరాత్రి రవి, లహరిలు ఇద్దరూ బాత్రూమ్‌లో హగ్‌ చేసుకున్నారంటూ ప్రియ షాకింగ్‌ విషయాలు రివీల్ చేశారు. దీంతో లహరి... నేషనల్‌ మీడియాలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తావంటూ ప్రియపై ఫైర్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2021, 07:00 PM IST
  • తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపిన యాంకర్ రవి భార్య
  • ప్రియను ఎలిమినేట్ చేయాలని డిసైడ్‌
  • కెప్టెన్సీ కోసం రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్‌
Bigg Boss Anchor Ravi issue : యాంకర్‌‌ రవి, లహరి మిడ్‌నైట్‌ హగ్‌ ఇష్యూపై నిత్య పోస్ట్, కెప్టెన్సీ కోసం సీక్రెట్ టాస్క్, ప్రియను ఎలిమినేట్ చేయాలని డిసైడ్‌

 Bigg Boss 5 Telugu Anchor Ravi wife reacts on Ravi Lahari Midnight Hug issue: బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్న రాత్రి రచ్చరచ్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రియ చేసిన వ్యాఖ్యలపై హౌజ్‌మేట్స్‌లో చాలా మంది మండిపడ్డారు. లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరుగుతుందని హాట్ కామెంట్స్ చేసింది ప్రియ. అంతేకాదు 

ఏంటక్కా ఇది

అర్ధరాత్రి రవి, (Ravi) లహరిలు ( Lahari) ఇద్దరూ బాత్రూమ్‌లో హగ్‌ చేసుకున్నారంటూ ప్రియ (Priya) షాకింగ్‌ విషయాలు రివీల్ చేశారు. దీంతో లహరి... నేషనల్‌ మీడియాలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తావంటూ ప్రియపై ఫైర్ అయింది. ఇక రవి కూడా అక్క.. ఏంటక్కా ఇది అంటూ ఫస్ట్ బాధను వెల్లబుచ్చినా.. తర్వాత తను కూడా సీరియస్ అయ్యాడు. తన కూతురుకు ఈ మాటలు అర్థం అయితే ఎలా ఉంటుందంటూ రవి ప్రియపై ఫైర్‌ అయ్యాడు. ఇక సన్నీ (sunny) కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడారు. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి.. ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని చెప్పాడు సన్నీ.

Also Read : Sonu Sood : చట్టానికి కట్టుబడి ఉంటా, నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ప్రజా సేవ కోసమే, రాజ్యసభ సీట్‌ ఆఫర్ చేసినా వద్దని చెప్పా : సోనూసూద్‌

నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు

ఈ విషయం సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఇష్యూపై యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తనకు చాలామంది ఈ ఇష్యూపై మెసేజెస్‌ చేస్తున్నారంది రవి భార్య. తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. తాను బాగానే ఉన్నానని చెప్పింది.

 
 
 
 
 

 

 

ప్రియను ఎలిమినేట్ చేయాలని డిసైడ్‌

తాను రవి గతంలో కూడా చాలా డిఫికల్ట్ పరిస్థితుల్ని ఫేస్ చేశామని చెప్పుకొచ్చింది నిత్య. తమ బంధాన్ని ఎవరూ విడగొట్టలేరు అని స్పష్టం చేసింది. ఇక యాంకర్ రవి (Anchor Ravi) అభిమానులంతా ఈ వారం ప్రియకు వ్యతిరేకంగా ఓటు వేసి ఆమెను బిగ్‌బాస్‌ (Bigg Boss) హౌజ్‌ నుంచి ఎలిమినేట్ చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. ఇక ఇవాల్టి ఎపిసోడ్‌లో హౌజ్‌లో చోటుచేసుకున్న పలు ఆసక్తికర విషయాలు ప్రసారం కానున్నాయి. కెప్టెన్సీ కోసం రవికి బిగ్‌బాస్‌ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చారు.

 

Also Read : ctress payal ghosh: పాయల్‌ ఘోష్‌ పై యాసిడ్‌ దాడి! నటికి గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News