Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్ బండారం బయటపెట్టిన నాగ్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

Bigg Boss Telugu 5: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్.. రోజురోజుకూ అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్‌ ఎపిసోడ్‌లో వచ్చేశాడు కింగ్‌ నాగార్జున. వచ్చీరావడంతోనే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కంటెస్టెంట్లపై రివ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆర్జే కాజల్‌ బండారాన్ని బయటపెట్టాడు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2021, 03:58 PM IST
  • ఆసక్తికరంగా బిగ్ బాస్ 5 తెలుగు
  • ఆర్జే కాజల్ బండారం బయటపెట్టిన నాగ్
  • ఇన్ స్టాలో ఆ వీడియోలేంటని ప్రశ్న
Bigg Boss 5 Telugu:  ఆర్జే కాజల్ బండారం బయటపెట్టిన నాగ్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

Bigg Boss Telugu 5 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల తెలుగులో ఐదో సీజన్ ప్రారంభమై..సందడి చేస్తోంది. ఇక హౌస్‏లో ఉండే కంటెస్టెంట్స్… మాట, ప్రవర్తన విధానాన్ని బట్టి వారిపై ఒక అంచనాకు వస్తుంటారు ప్రేక్షకులు. ఇక బిగ్ బాస్(Bigg Boss Reality Show) కొందరికి ప్లస్.. మరికొందరికి మైనస్. పాపులారిటీ ఉన్నవారికి తగ్గించవచ్చు.. అస్సలు జనాలకు తెలియని వారిని ఫేమస్ చేయడం కూడా ఒక్క బిగ్‏బాస్ షోకే సాధ్యం.

 ఇక ఇంట్లో మాట్లాడే ప్రతి మాటకు ప్రేక్షకులు నుంచి డిఫరెంట్ రియాక్షన్స్ వస్తుంటాయి. అక్కడ కంటెస్టెంట్స్ (Contestants)మాట్లాడే మాటలకు సోషల్ మీడియాలో కౌంటర్స్ రావడం..ట్రోల్స్ చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా తమ గురించి ఇతర ఇంటి సభ్యులతో చర్చించే ముందు జాగ్రత్తగా చెప్పాల్సిందే. ఒక్క అబద్ధం చెప్పినా.. నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఆర్జే కాజల్(‏RJ Kajal)పై నెటిజన్స్ తెగ మండిపడుతున్నారు.

Also Read: Bigg Boss Telugu season 5: కాజల్‌ వీడియోలు అన్నీ చూసేశానన్న నాగ్.. వారిద్దరూ సేఫ్‌, డేంజర్‌‌ జోన్‌లో ఆ నలుగురు

షోలో మొదటి రోజు నుంచి ఆర్జే కాజల్.. ఎంతో ఉత్నాహంగా కనిపిస్తూ.. అందరి విషయాల్లో తలదురుస్తూ వస్తోంది. అయితే ఆమె ప్రవర్తన ఇంట్లో చాలా మందికి నచ్చడం లేదు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదురుస్తుందని అటు ఇంట్లో.. ఇటు బయట కూడా నెగిటివ్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్జే కాజల్(RJ Kajal) చేసిన కామెంట్స్ ఇంట్లో రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. 

కాజల్.. వంటరాదు.. అంట్లు తోమను అంటూ చెప్పడం ఇంట్లో వాళ్లకే కాదు.. జనాలకు కూడా నచ్చలేదు. ఇంట్లో మొదటి కెప్టెన్‏గా ఎన్నికైన సిరి.. డిపార్ట్మెంట్స్ వారిగా సభ్యులను పనులను నిర్ణయించింది. అయితే వెంటనే కాజల్.. తనకు కిచెన్ డిపార్ట్మెంట్ తప్పా మరే పని అయినా చేస్తాను అని.. తనకు వంట చేయడం రాదని బుకాయించింది. దీంతో వెంటనే శ్రీరామ చంద్ర ఆమెపై ఫైర్ అయ్యాడు. నేను కూడా ఇంట్లో ఏ పని చేయలేదు. కానీ ఇక్కడ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా నెటిజన్స్ ఆర్జే కాజల్‏ తన ఇన్‏స్టా(Instagram)లో ఉన్న వంట చేస్తున్న వీడియోలను బయటకు తీశారు. వంట రాదని చెప్పింది..కానీ ఇంట్లో మాత్రం వంట చేస్తుంది.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శనివారం జరిగిన వీకెండ్ షోలో నాగార్జున*(Nagarjuna) కూడా వంట బండారాన్ని బయటపెట్టేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News