Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో షణ్ముఖ్‌ బర్త్‌డే వేడుకలు.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దీప్తీ..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా గురువారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. షణ్ముఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా హౌజ్‌లో వేడుకలు జరిగినట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2021, 09:47 PM IST
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో షణ్ముఖ్‌ బర్త్‌డే వేడుకలు.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దీప్తీ..

Bigg Boss 5 Telugu Latest Promo: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ రోజురోజుకీ ఆసక్తిని పెంచుతోంది. హౌస్ మేట్స్ మధ్య కోట్లాటలు, ప్రేమలు, అలకలు ఇలా షో రసవత్తరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే గురువారం ప్రసారమయ్యే షోకు సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోతో ఎపిసోడ్‌పై హైప్‌ను పెంచారు. షణ్ముఖ్‌ పుట్టిన రోజు (Shanmukh Birth Day) సందర్భంగా హౌజ్‌లో వేడుకలు జరిగినట్లు ప్రోమో (Promo)చూస్తే అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే హమీదా-షణ్ముఖ్‌ల మధ్య సంథింగ్‌, సంథింగ్‌ అన్న విధంగా రవి, శ్వేత ఆటపట్టించారు. దీంతో వీరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉంటే షణ్ముఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్‌ దీప్తి సునయన(Deepti Sunayana) మాట్లాడడానికి ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు షో నిర్వాహకులు. దీంతో షణ్ముఖ్‌కు పుట్టిన రోజు వేడుకలు తెలిపిన దీప్తి.. ‘ఐ లవ్‌ యూ’ అని చెప్పేసింది.

Also read: Bigg Boss 5 Telugu: షన్నూ ఫ్యాన్స్ ఫోన్ చేసి మరీ తిడుతున్నారు: సరయు

దీంతో షణ్ముఖ్‌(Shanmukh) ఎమోషనల్‌ అయ్యాడు. ఇక బిగ్‌బాస్ హౌజ్‌ సెట్‌ బయట దీప్తి తన స్నేహితులతో కలిసి టపాసులు పేల్చి షణ్ముఖ్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించింది. దీనంతటినీ సోషల్‌ మీడియా(Social Media)లో పోస్ట్‌ చేసింది. హౌజ్‌ బయట షణ్ముఖ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పడంతో దానికి హౌజ్‌లో ఉన్న వాళ్లు అరుస్తూ సమాధానం ఇచ్చారు. దీంతో.. ‘మావోడు రిప్లై ఇచ్చాడురోయ్‌’ అంటూ దీప్తి వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌(Viral)గా మారాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News