Bheemla Nayak Title Song: భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ వీడియో వచ్చేసింది!

Bheemla Nayak Title Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్! పవన్, రానా కలిసి నటించిన 'భీమ్లానాయక్' మూవీలోని టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటన చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 05:06 PM IST
Bheemla Nayak Title Song: భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ వీడియో వచ్చేసింది!

Bheemla Nayak Title Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'భీమ్లానాయక్'. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపుగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడీ సినిమా నుంచి ఓ అప్టేడ్ వచ్చింది. మూవీలోని టైటిల్ సాంగ్ 'భీమ్.. భీమ్.. భీమ్.. భీమ్.. భీమ్లానాయక్' వీడియోను మంగళవారం విడుదల చేశారు. లిరికల్ వీడియో మాదిరి ఇది కూడా యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది. 

ఓటీటీ రిలీజ్ కు సిద్ధం

థియేటర్లలో రచ్చలేపిన 'భీమ్లానాయక్' మూవీ ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రేక్షకులను సందడి చేసేందుకు సిద్ధమైంది. మార్చి 25న అటు ఆహా ఓటీటీతో పాటు డిస్నీ + హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ ట్రైలర్లను ఇటీవలే విడుదల చేయగా.. వాటికి విశేష స్పందన లభిస్తుంది. 

'భీమ్లానాయక్' టైటిల్ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించగా.. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మేనన్.. రానా దగ్గుబాటి సరసన సంయుక్త మేనన్ హీరోయిన్స్ గా నటించారు. సితార ఎంటర్ టైనర్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ సినిమాను నిర్మించారు.   

Also Read: Beast Release Date: 'కేజీఎఫ్ 2'కి పోటీగా రిలీజ్ కు సిద్ధమైన విజయ్ 'బీస్ట్'!

Also Read: Mouni Roy Photos: పెళ్లి తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న 'నాగిని' బ్యూటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News