భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్‌తో హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్

భరత్ అనే నేను సినిమాకు సంబంధించి హీరోయిన్ కియారా అద్వాని ఫస్ట్ లుక్ రిలీజైంది.

Last Updated : Apr 1, 2018, 09:24 AM IST
భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్‌తో హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అప్‌కమింగ్ సినిమా 'భరత్ అనే నేను'కు సంబంధించి ఆ సినిమా హీరోయిన్ కియారా అద్వాని ఫస్ట్ లుక్ రిలీజైంది. మహేష్ బాబుకు జంటగా నటించిన కియారానే స్వయంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని లాంచ్ చేయడం విశేషం.  మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు ఓ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సూపర్ స్టార్ అభిమానుల్లో, ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ ట్రాక్‌కి ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆడియెన్స్‌ని అలరిస్తోంది. త్వరలోనే సెకండ్ సింగిల్‌ని కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 

 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న  ఈ సినిమా ఏప్రిల్ 20వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. 

Trending News