Bhale Bhale Banjara: మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగ.. 'భలే భలే బంజారా' సాంగ్ వచ్చేసింది!

Bhale Bhale Banjara: 'ఆచార్య' సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్టెప్ప్పులేసిన 'భలే భలే బంజారా' ఫుల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్ లో చిరంజీవి, రామ్ చరణ్ వేసే స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం 'భలే భలే బంజారా' సాంగ్ ఎలా ఉందో మీరే చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 05:35 PM IST
    • 'ఆచార్య' మూవీ నుంచి మరో అప్డేట్
    • సినిమాలోని 'భలే భలే బంజారా' సాంగ్ రిలీజ్
    • మాస్ట్ స్టెప్పులతో అలరించిన చిరంజీవి, రామ్ చరణ్!
Bhale Bhale Banjara: మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగ.. 'భలే భలే బంజారా' సాంగ్ వచ్చేసింది!

Bhale Bhale Banjara: మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో మేకర్స్ జోరును పెంచేశారు. ఈ మూవీలోని కీలక లిరికల్ సాంగ్ 'భలే భలే బంజారా.. సిరుత పులుల సిందాట' పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. 

ఈ పాటలో చిరు - రామ్ చరణ్ ల డ్యాన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గేయరచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. తండ్రికొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చిందేసిన ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. 'ఆచార్య' సినిమాలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరంజీవి తెరపై కనిపించనున్నారని సమాచారం. 

ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి.. నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు చిరు సతీమణి కొణిదెల సురేఖ సమర్పిస్తుండడం విశేషం.  

Also Read: Ante Sundaraniki Teaser: 'అంటే సుందరానికీ!' మూవీ టీజర్ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ALso Read: Pragya Jaiswal Photos: పొట్టి డ్రస్సులో హీట్ పెంచుతున్న బాలయ్య హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News