‘భాగమతి’ సినిమా ట్రైలర్ అదుర్స్..!

టాలీవుడ్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘భాగమతి’.

Last Updated : Jan 8, 2018, 04:42 PM IST
‘భాగమతి’ సినిమా ట్రైలర్ అదుర్స్..!

టాలీవుడ్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘భాగమతి’. పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అశోక్ డైరెక్ట్ చేశారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా?‘భాగమతి’ అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను’ అని అనుష్క ట్రైలర్ చివరలో చెప్పిన డైలాగ్‌కి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘భగ.. భగ.. భగ.. భాగమతి’ సాగే ఈ ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వైవిధ్యంగా ఉంది.  యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ బాణీలు సమకూర్చారు. జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. తమిళ,తెలుగు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.

Trending News