Vijay Devarakonda Father : విజయ్ దేవరకొండను మళ్లీ గెలికిన బండ్ల గణేష్.. నెటిజన్ల కామెంట్లు వైరల్

Bandla Ganesh on Vijay Devarakonda బండ్ల గణేష్ తాజాగా వేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. సమయం సందర్భం అనేది లేకుండా విజయ్ దేవరకొండను ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2022, 01:26 PM IST
  • నెట్టింట్లో బండ్ల గణేష్ సందడి
  • విజయ్ దేవరకొండపై బండ్లన్న సెటైర్
  • తండ్రి ప్రేమపై బండ్లన్న ట్వీట్
Vijay Devarakonda Father : విజయ్ దేవరకొండను మళ్లీ గెలికిన బండ్ల గణేష్.. నెటిజన్ల కామెంట్లు వైరల్

Vijay Devarakonda Father బండ్ల గణేష్ వేసే ట్వీట్లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంటాయి. అయితే ఆ మధ్య విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ వేశాడు. లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. బాబు ఎవరో తెలియదు, తాత ఎవరో తెలియదు.. అయినా నేనంటే ఎందుకింత పిచ్చో అర్థం కావడం లేదు కాస్త ఓవర్‌గా మాట్లాడాడు. వాటిపై బండ్ల గణేష్ ఓ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. తాతలు తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, మహేష్, చరణ్, ప్రభాస్‌ వంటి వారిలా.. గుర్తుపెట్టుకో బ్రదర్ అని కౌంటర్ వేశాడు.

అయితే ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు బండ్ల గణేష్. కరోనా సమయంలో బండ్ల గణేష్ తన తండ్రికి కటింగ్ చేశాడన్న సంగతి తెలిసిందే. తన తండ్రి మీద ప్రేమను కురిపిస్తూ ఇంట్లోనే అలా కటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇక అదే కరోనాలో తన తండ్రితో కలిసి ఫుల్ చిల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. తండ్రి ముందు కాలు అలా జాపి కూర్చున్నాడు విజయ్ దేవరకొండ.

ఇప్పుడు విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు.  మనకి ఈ ప్రపంచాన్ని చూసి అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం అంటూ విజయ్ దేవరకొండకు తన తండ్రి అంటే అంత గౌరవం, ప్రేమ లేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేశాడు బండ్ల గణేష్. దీంతో బండ్ల గణేష్ ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఒకటి, రెండు సినిమాలు హిట్ అయ్యేసరికి మనమే పుడింగిలం, మనమే తోపు, మనం చేసేదే ట్రెండ్ అని బలుపు ఎక్కువై కొట్టుకుంటున్నారు అని ఓ నెటిజన్ అంటే.. నువు అన్ని ముసుకుంటే బెటర్.. ఎవరి ప్రేమ వాళ్ల ఇష్టము.. ఎవరు ఎలా ప్రేమని చూపిస్తారు అనేది వాళ్ల ఇష్టము. అందరు నీలాగ ఫోటోల కోసం ఓవర్ యాక్టింగ్ చేయరు అని ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. ఇలా పాజిటివ్, నెగెటివ్ కామెంట్లతో బండ్లన్న ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read : Raviteja As Vikram Sagar ACP : మాస్ లుక్, తెలంగాణ యాస.. వాల్తేరు వీరయ్యకు ధీటుగా రవితేజ

Also Read : Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం.. కారణం తెలుసా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News