Unstoppable 3: అన్‌స్టాపబుల్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు, అతిధులు ఎవరో తెలుసా

Unstoppable 3: ఓటీటీ వేదికపై సెన్సేషనల్ షోగా నిలిచిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఇప్పుడు మరో సీజన్‌కు సిద్దమౌతోంది. ఆహా వేదికపై స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ రెండు సీజన్లు టాప్ హిట్స్‌గా నిలిచాయి. ఇక మూడవ సీజన్ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2023, 03:45 PM IST
Unstoppable 3: అన్‌స్టాపబుల్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు, అతిధులు ఎవరో తెలుసా

Unstoppable 3: ఆహా తెలుగు ఓటీటీ వేదికపై స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఓటీటీ వేదికపై ఓ సెన్సేషన్. మాస్ హీరో బాలకృష్ణ తొలిసారిగా యాంకర్ అవతారమెత్తిన షో అది. మొదటి రెండు సీజన్లు ఊహించని విజయం సాధించడంతో ఇప్పుడు మూడవ సీజన్ సిద్ధమౌతోంది. అన్‌స్టాపబుల్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్, అతిధులు ఎవరనేది పరిశీలిద్దాం.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సీజన్ 1 ఆహాలో స్ట్రీమింగ్ అయినప్పుడు చాలామంది బాలయ్య యాంకర్ ఏంటని సందేహపడ్డారు. కానీ అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ యాంకర్‌గా బాలయ్య అదరగొట్టడమే కాకుండా షోకు వచ్చే గెస్ట్‌లు కూడా ఆసక్తి పెంచడంతో అన్‌స్టాపబుల్ సీజన్ 1 భారీగా హిట్టయింది. ఆ తరువాత అంతకు మించిన అంచనాలతో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 కు సైతం భారీగా స్పందన లభించింది. సీజన్ 2లో అయితే రెబెల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల ఎపిసోడ్స్ భారీగా రేటింగ్స్ సంపాదించి పెట్టాయి. ఓ విధంగా చెప్పాలంటే ఈ రెండు ఎపిసోడ్‌లు టాప్ హిట్ అయ్యాయి. 

ఇప్పుడు అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 3 ప్రారంభం  కానుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడు, వచ్చే అతిధులెవరనేది ఆసక్తి కల్గిస్తోంది. ఈ క్రమంలో ఆహా టీమ్ అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రకటించింది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ అతిధులుగా భగవంత్ కేసరి టీమ్ వస్తోంది. భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ డిజైన్ చేశారు. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ విత్ భగవంత్ కేసరి టీమ్ షో ఈ నెల 17న స్ట్రీమ్ కానుంది. ఈ షోలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, దర్శకుడు అనిల్ రావిపూడిలు అతిధులుగా హాజరుకానున్నారు. 

Also read: Saindhav Movie: ఇవాళ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న సైంధవ్ టీం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News