Nartanasala first look: నర్తనశాల ఫస్ట్ లుక్ వచ్చేసింది

నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతూ సౌందర్య ఆకస్మిక మృతితో ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు నిన్న సోమవారం ప్రకటించిన బాలయ్య బాబు.. చెప్పినట్టుగానే కొద్దిసేపటి క్రితం నర్తనశాల ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

Last Updated : Oct 20, 2020, 02:08 PM IST
Nartanasala first look: నర్తనశాల ఫస్ట్ లుక్ వచ్చేసింది

నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ ( Balakrishna ), సౌందర్య ( Actress Soundarya ) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతూ సౌందర్య ఆకస్మిక మృతితో ఆగిపోయిన నర్తనశాల మూవీకి ( Nartanasala movie ) సంబంధించిన ఫస్ట్ లుక్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు నిన్న సోమవారం ప్రకటించిన బాలయ్య బాబు.. చెప్పినట్టుగానే కొద్దిసేపటి క్రితం నర్తనశాల ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. హెలీక్యాప్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి ( Soundarya death in helicopter crash ) చెందడంతో అప్పట్లో ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. Also read : Ninnila Ninnila first look: కొత్తగా ఉన్న నిన్నిలా నిన్నిలా ఫస్ట్ లుక్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Here its The 1st look poster of #Narthanasala . . @balakrishna_nandamuri_ . . . . #nandamuribalakrishna #nbk #balayya #balayyababu #ntr #balakrishna #nbkfilms #shreyaset #srntr #joharntr

A post shared by Nandamuri balakrishna (@balakrishna_nandamuri_) on

ఆ తర్వాత అనేక వేదికలపై నర్తనశాల ప్రస్తావన తీసుకొచ్చిన బాలయ్య బాబు.. సౌందర్య లాంటి నటి తనకు కనిపించినప్పుడు తప్పకుండా నర్తనశాల సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తాను అని చెబుతూ వచ్చారు. ఇప్పుడిలా మళ్లీ ఈ సినిమాను తెరపైకి తీసుకొస్తున్నారంటే.. ఆయనకు సౌందర్య స్థానంలో ఆమె లాంటి మరో హీరోయిన్ లభించినట్టేననే టాక్ వినిపిస్తోంది. Also read : Nartanasala first look: బాలక్రిష్ణ, సౌందర్య నటించిన 'నర్తనశాల' ఫస్ట్ లుక్ డీటేల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News