ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన బాహుబలి 2 చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాసిందో తెలియని విషయం కాదు. అటువంటి చిత్రం ఇప్పుడు ఐఐఎం, అహ్మదాబాద్‌లో విద్యార్థుల సిలబస్‌లో కేస్ స్టడీగా మారబోతోంది. ఇదే విషయమై ఆ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ, గతంలో ఇలాంటి అంశంపైనే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం వారు అధ్యయనం చేశారన్నారు. ఆ అధ్యయనంలో సినిమాలకు సీక్వెల్స్ వచ్చినప్పుడు.. ఆయా సీక్వెల్స్ కంటే ప్రీక్వెల్స్‌కే ఎక్కువ పేరు వస్తుందని తేలిందన్నారు. అయితే బాహుబలి 2 చిత్రం ఆ అభిప్రాయాన్ని తప్పు అని నిరూపించిందన్నారు. సరైన మార్కెటింగ్ ప్రణాళికతో పాటు క్రియేటివిటీ ఉంటే స్వీక్వెల్స్ కూడా ఊహించని రీతిలో పేరుతో పాటు విజయం సాధిస్తాయన్న విషయం బాహుబలి 2 చిత్రంతో నిజమైందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్స్‌లో చిత్ర పరిశ్రమపై కూడా పలు కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థగా ఐఐఎం అహ్మదాబాద్‌కు పేరుండడం గమనార్హం
ఐఐఎం విద్యార్థుల సిలబస్‌లో బాహుబలి