Karthik Raju Interview:
అథర్వ ప్రయాణం ఎలా మొదలైంది? ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
దర్శకుడికి నేను ఈ సినిమా కథని పది నిమిషాల్లో చెప్పమన్నాను. అది వినింది కథ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో.. ఆ చర్చలు మూడు గంటల పాటు జరిగాయి. అలా అథర్వను ప్రారంభించాం. ఇందులో హీరో పాత్రకు ఆస్తమా ఉంటుంది. అందుకే పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్నా కాలేకపోతాడు. చివరకు ఇక ఈ హీరో క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు.
ఈ సినిమాలో ఉండే కొత్త పాయింట్ ఏమిటి?
దాదాపు తెలుగులో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ కూడా ఒకే ఫార్మాట్‌లో ఉంటాయి. కానీ ఈ చిత్రం ఎలాంటి క్లూస్ లేని ఓ కేసుని ఎలా పరిష్కరించారు అనేది ఆసక్తిరకంగా ఉంటుంది.
ఈ సినిమాలో నటించడం మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
ఇలాంటి జానర్లో నటించే టైంలో ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. నటుడి నటన పైన ఇలాంటి సినిమాలన్నీ బేస్ అయి ఉంటాయి. నాకు ఈ పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్ పాత్రలు ఎలా ఉంటాయి?
ఈ సినిమాలో క్రైమ్ జర్నలిస్ట్(సిమ్రాన్ చౌదరి)గా ఒకరు, సినిమా హీరోయిన్(ఐరా)గా మరొకరు నటించారు. రెండు పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఈ సినిమాను చూసిన తరువాత క్లూస్ టీం ఎలా స్పందించింది?
క్లూస్ టీం కోసం స్పెషల్‌గా షోను వేయించాం. మూవీని చూసి వారంతా సంతోషించారు. నార్మల్ గా వాళ్ళు అసలు క్రైమ్ థ్రిల్లర్‌లను చూడరంట. కానీ మా అథర్వను చూసి మెచ్చుకున్నారు.
కౌసల్యా కృష్ణమూర్తి గ్యాప్ కి కారణం ఏమిటి?
కౌసల్యా కృష్ణమూర్తి తరువాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. అంతేకాకుండా కథలు చూసి మరి ఎంచుకుంటున్నాను. ఏ చిన్న తప్పు జరగకుండా చూసుకుంటున్నాను.
మీకు ఏ జానర్‌లో సినిమా చేయాలని ఉంది?*
ఫుల్ ఎంటర్టైన్మెంట్ జానర్‌లో ఓ మూవీని చేయాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి స్టైల్లో ఓ సినిమాను చెయ్యాలి అనే ఆశ నాకు చాలా రోజుల నుంచి ఉంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook