Rashmika Mandanna Dating : రష్మిక ప్రస్తుత దుస్థితికి కారణం విజయ్ దేవరకొండనా?.. వేణు స్వామి కామెంట్స్ వైరల్

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 04:59 PM IST
  • విజయ్ రష్మిక డేటింగ్‌ రూమర్లు
  • విజయ్ జాతక ప్రభావం వల్లే ఇలా
  • ఆస్ట్రాలజర్ వేణు స్వామి కామెంట్స్
Rashmika Mandanna Dating : రష్మిక ప్రస్తుత దుస్థితికి కారణం విజయ్ దేవరకొండనా?.. వేణు స్వామి కామెంట్స్ వైరల్

Venu swamy on Rashmika Mandanna సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియా ఎక్కువగా ఫేమస్ అయ్యాడు వేణు స్వామి. సమంత, చైతన్యలకు విడాకులు అవుతాయని గతంలోనే ఎప్పుడో చెప్పేశాడు వేణు స్వామి. ఇక రష్మిక మందనకు ఓ పవర్ ఫుల్ పూజ చేయించాడట, అందుకే ఆమె దశ తిరిగిందని చెప్పుకొచ్చాడు. రక్షిత్ శెట్టితో బ్రేకప్ చేస్తే జీవితం బాగుంటుందని వేణు స్వామి చెప్పడంతోనే అలా చేసిందట. అయితే రష్మిక మందన జాతకం మీద ఇప్పుడు కామెంట్ చేశాడు.

విజయ్ జాతక ప్రభావం ఇప్పుడు రష్మిక మందన మీడ పడిందట. అందుకే రష్మికకు అంతా బ్యాడ్ టైం నడుస్తోందని వేణు స్వామి అన్నాడు. విజయ్ రష్మికలు కలిసి ఉంటే ఇలానే ఉంటుందని, ఇరువురి జాతకాలు అలానే ఉన్నాయంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు. ఈ మధ్య రష్మిక మీద వచ్చిన కాంట్రవర్సీలు కూడా జాతక ప్రభావమేనని వేణు స్వామి తెలిపాడు.

ప్రస్తుతం చూస్తుంటే రష్మిక పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. ఈ మధ్య రష్మిక మీద కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ వేసిందనే వార్తలు రావడం, రిషభ్ శెట్టి, కాంతారా వివాదంలో రష్మిక ఇరుక్కోవడం అందరికీ తెలిసిందే. ఇక పర్సనల్‌గా ఇలా ఉంటే.. కెరీర్ పరంగానూ ఆమెకు పెద్దగా కలిసి రావడం లేదు.

హిందీలో ఆమె చేసిన సినిమాలు ఆకట్టుకోవడం లేదు. వరుసగా బోల్తా పడుతున్నాయి. ఇక తెలుగులోనూ ఇప్పుడు ఏ సినిమా చేతిలో లేదు. పుష్ప ది రూల్ ఎప్పుడు మొదలవుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక వారసుడు సినిమాతో రష్మిక తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. మరి ఈ చిత్రం రష్మికకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Also Read : Namrata Mahesh Babu Dating : డేటింగ్ సమయంలో అదే చేశాం.. ఎప్పుడూ బోర్ కొట్టనివ్వలేదు.. మహేష్‌పై నమ్రత కామెంట్స్

Also Read : Nayanthara : అందుకే ప్రమోషన్లకు రావడం లేదు.. నోరు విప్పిన నయనతార.. నయన్ బాధ అదేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News