Ashu Reddy Love : ఒకసారి జరిగింది చాలు!.. మేకప్ మెన్‌తో అషూ రెడ్డి ముచ్చట్లు

Ashu Reddy With Makeup Man అషూ రెడ్డి, మేకప్ మెన్ రవి ఇద్దరూ కూడా తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ముచ్చట్లు వైరల్ అవుతున్నాయి. నాతో నేను ప్రేమలో పడిపోయాను అంటే.. దానికి తన హెయిర్ స్టైలిష్ట్ ఫన్నీ కామెంట్లు పెట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 09:04 AM IST
  • నెట్టింట్లో అషూ రెడ్డి సందడి
  • హెయిర్ స్టైలిష్ట్‌తో ముచ్చట్లు
  • ప్రేమ గురించి చెప్పిన అషూ
Ashu Reddy Love : ఒకసారి జరిగింది చాలు!.. మేకప్ మెన్‌తో అషూ రెడ్డి ముచ్చట్లు

Ashu Reddy With Makeup Man అషూ రెడ్డి బిగ్ బాస్ షోలో ఉన్న టైంలో.. తన ప్రేమ కథ, బ్రేకప్ విషయాలు, డిప్రెషన్‌లోకి వెళ్లడం అన్నింటి గురించి చెప్పింది. అయితే అషూ రెడ్డి మళ్లీ ఇంత వరకు ప్రేమలో పడినట్టుగా కనిపించడం లేదు. రాహుల్ సిప్లిగంజ్‌తో పార్టీలు, పబ్బులు అని తిరుగుతుంది. కానీ తమ ఇద్దరి మంచి దోస్తాన్ అని చెబుతుంటారు. ఎక్స్ ప్రెస్ హరితో టీఆర్పీ కోసం లవ్ ట్రాక్ అషూ రెడ్డి నడిపించినట్టు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు అయితే అషూ రెడ్డి సింగిల్‌గానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఆమె వేసిన పోస్ట్, దానికి ఆమె హెయిర్ స్టైలిష్ట్ రవి పెట్టిన కామెంట్లు, దానికి అషూ ఇచ్చిన రిప్లైలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ రెడ్ డ్రెస్ మళ్లీ నన్ను నాతో ప్రేమలో పడేసేలా చేసింది అని అషూ రెడ్డి చెప్పుకొచ్చింది. దీనిపై హెయిర్ స్టైలిష్ట్ రవి స్పందించాడు. మళ్లీ లవ్ అంటే కష్టమే అని కౌంటర్లు వేశాడు. దానికి అషూ ఇలా రియాక్ట్ అయింది. ఒకసారి లైఫ్‌లో హర్ట్ అయింది చాలు.. అంటూ దండం పెట్టేసింది. సోలో లైఫ్ సో బెటర్ అని రవి నవ్వేశాడు.

అషూ రెడ్డి లవ్ స్టోరీలో ఆమె ఫ్రెండే మోసం చేసిందని, మళ్లీ తన ఫ్రెండ్ తన లవర్ ఒక్కటయ్యారని, ఆ ఫ్రెండే మోసం చేయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టుగా అషూ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లో చెప్పేసింది. ఇక బయటకు వచ్చిన తరువాత రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డిలు సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. అషూ రెడ్డి అయితే కావాలనే రాహుల్ తన గుండెల్లో ఉన్నాడని మరింతగా నెటిజన్లను రెచ్చగొట్టేది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

అషూ రెడ్డి ఇక కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి లవ్ ట్రాక్ నడిపించినట్టుగా అనిపిస్తుంది. అయితే అవన్నీ టీఆర్పీ స్టంట్లే. షోలో ట్రాక్ బాగా వర్కౌట్ అవ్వాలని అలా నటించేవాళ్లు. హరి అయితే ఏకంగా అషూ రెడ్డి పేరుని టాటూగా వేయించుకున్నాడు. అది రియలా? ఫేకా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే అషూ రెడ్డి ఇక సింగిల్‌గానే ఉండాలని ఫిక్స్ అయినట్టుగా ఈ పోస్ట్ ద్వారా కనిపిస్తోంది.

Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ

Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News