Arjun Sarja Coronavirus: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకోగా.. రీసెంట్‌గా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇటీవలే కరోనా టెస్ట్ చేయించుకోగా అందులో కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని అర్జున్ తెలిపాడు. ప్రస్తుతం తాను క్వారంటైన్ లో ఉన్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు.
"అందరికి నమస్కారం. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచనలు మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మనవి చేస్తున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించండి. రామ భక్త హనుమాన్ కి జై" అని అర్జున్ సర్జా ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
Also Read: పాల బుగ్గలతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ తెలుసా?
Also Read: Covid 19: బాలీవుడ్ హీరోయిన్లు కరీనా,అమృతలకు కరోనా-నిర్లక్ష్యమే కొంపముంచింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook