Arjun Sarja: ఆ విషాదాలు మరువక ముందే అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం!

Arjun Sarja Mother Lakshmi Devamma Passed Away: అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ సర్జాకు మాతృ వియోగం కలిగింది.  

Last Updated : Jul 23, 2022, 01:14 PM IST
  • అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం
  • అనారోగ్య కారణాలతో తల్లి మృతి
Arjun Sarja: ఆ విషాదాలు మరువక ముందే అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం!

Arjun Sarja Mother Lakshmi Devamma Passed Away: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట వరుస విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయన మేనల్లుడు, కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం పాలైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక కొన్నేళ్ళ క్రితం ఆయన భార్య తండ్రి రాజేష్ కూడా కన్నుమూశారు. ఇక ఆ విషాదాలు మరవక ముందే మరో విషాదం నెలకొంది.

అర్జున్ సర్జాకు మాతృ వియోగం కలిగింది. అర్జున్ తల్లి  లక్ష్మీ దేవమ్మ శనివారం నాడు బెంగళూరులో కన్నుమూశారు. ఆమెకు అనారోగ్యం కలగడంతో ఆమెను అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఆమె వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలని అంటున్నారు. ఇక మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు కాగా అందులో ఒకరు అర్జున్ సర్జా, మరొకరు కిషోర్ సర్జా.

అలాగే ఆమెకు ఓ కుమార్తె కూడా ఉండగా ఆ కుమార్తె సంతానం ఇద్దరూ కూడా హీరోలు అయ్యారు. ఇక ఇప్పటికే చిరంజీవి సర్జా అనారోగ్య కారణంగా పరమపదించగా మరో కుమారుడు ధృవ్ సర్జా కన్నడ హీరోగా సత్తా చాటుతున్నారు. ఇక ప్రస్తుతం లక్ష్మీ దేవమ్మ  పార్థివ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ నుంచి ఇంటికి తరలిస్తున్నారు.

నోట్: ఈ ఆర్టికల్ అప్‌డేట్ చేయబడుతుంది.

Also Read: Nabha Natesh: అబ్బా అనిపిస్తున్న నభా.. హాట్ ట్రీట్ ఇచ్చేసిందిగా!

Also Read: Samantha: ఏంటమ్మా ఇది.. మా వాడు బంగారం కదా.. సమంతను దెప్పిపొడుస్తున్న చైతూ ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News