ఆ జంట విరుష్క అయితే.. ఈ జంట ప్రనుష్క..!

క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం కాకముందు ఆ జంటకి సినీ అభిమానులు పెట్టుకున్న పేరు "విరుష్క".

Last Updated : Jan 25, 2018, 11:49 AM IST
ఆ జంట విరుష్క అయితే.. ఈ జంట ప్రనుష్క..!

క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం కాకముందు ఆ జంటకి సినీ అభిమానులు పెట్టుకున్న పేరు "విరుష్క". ఇప్పుడు అలాంటి పేరే బాహుబలి సినిమా నాయికా నాయికలు ప్రభాస్, అనుష్కలకు పెట్టారు వారి అభిమానులు. వీరిద్దరి జంట చాలా బాగుందని.. వారు పెళ్లి చేసుకుంటే తాము సంతోషపడతామని చెబుతూ సోషల్ మీడియాలో "ప్రనుష్క" పేరుతో ఫోటోలు, పోస్టర్లు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ పెళ్లికి సంబంధించి వార్తలు వస్తున్న క్రమంలో.. ఆయన అనుష్క శెట్టిని వివాహం చేసుకుంటే బాగుంటుందని కూడా పోస్టులు పెడుతున్నారు ఆయన అభిమానులు. ఇటీవలే అనుష్క శెట్టి తన 'భాగమతి' సినిమా ప్రమోషన్‌‌కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇదే టాపిక్ పై మీడియా ప్రశ్నించగా, ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని.. అంతకు మించి తమకు ఇతరత్రా ఆలోచనలు ఏమీ లేవని చెప్పింది ఆ టాలీవుడ్ బ్యూటీ. బాహుబలి చిత్రం జంటగా నటించిన "ప్రభాస్ -అనుష్క"ల జోడిని ఇప్పటికే బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్‌‌గా డిక్లేర్ చేసింది టాలీవుడ్. 

Trending News