Ante Sundaraniki Trailer: ఇంకా ఉన్నది ఒకటే ఆప్షన్.. ఇక లేచిపోవడమే! 'అంటే సుందరానికి' ట్రైలర్ అదుర్స్..

Nani's Ante Sundaraniki movie Trailer released. ఈరోజు సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు 'అంటే సుందరానికి' సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2022, 06:30 PM IST
  • జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు అంటే సుందరానికి
  • ట్రైలర్ వచ్చేసింది
  • ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని
Ante Sundaraniki Trailer: ఇంకా ఉన్నది ఒకటే ఆప్షన్.. ఇక లేచిపోవడమే! 'అంటే సుందరానికి' ట్రైలర్ అదుర్స్..

Nani, Nazriya Nazim starrer Ante Sundaraniki movie Trailer is out:  నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'అంటే సుందరానికి'. టాలెంటెడ్ యువ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. 

ముందుగా ప్రకటించిన సమయానికే.. ఈరోజు సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు విశాఖపట్నం వేదికగా 'అంటే సుందరానికి' సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.  2 నిమిషాల 50 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్.. 'ఎవరా అమ్మాయి.. హిందుస్ హా, చెప్పిచావరా?' అనే డైలాగుతో ఆరంభం అవుతుంది. 'నాకు పెద్ద కోరికలు ఏమీ లేవండి, నేను కూడా అమెరికా వెళ్లి.. అక్కడినుంచి మా స్నేహితులకు ఫోన్ చేసి నేను కాలిఫోర్నియాలో ఉన్నాను, ఇక్కడ ఈ వర్షాలు ఏంటిరా బాబు అని ఒకేసారి మాట్లాడితే చాలండి'అనే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. 

'అంటే సుందరానికి' సినిమాలో ఎంత వినోదం ఉంటుందో ఇప్పటికే విడుదలైన టీజర్‌ చెప్పకనే చెప్పింది. ఇప్పుడీ ట్రైలర్‌ అంతకుమించిన వినోదం పంచుతోంది. ట్రైలర్‌లో చూపించిన ప్రతి క్యారెక్టర్‌ నవ్వులు పూయిస్తోంది. ముఖ్యంగా హీరో నాని హావభావాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. నాని కామెడీ, నజ్రియా నజిమ్ అందం సినిమాకు ప్లస్ కానున్నాయి. 

'అంటే సుందరానికి' ట్రైలర్‌ను బట్టి హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి ప్రేమించుకునే కథతో సినిమా నడుస్తుంది. సాంప్రదాయం, ఆచారాలు నిష్టగా ఆచరించే సుందరం కుటుంబం అతడి వివాహానికి ఒప్పుకుంటుందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. ఈ చిత్రంలో సుందర్‌గా నాని, లీల అనే పాత్రలో నజ్రియా కనిపించనున్నారు. నరేశ్‌, రోహిణి, నదియా, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Also Read: Kamal Haasan Remuneration: 'విక్రమ్‌' సినిమా కోసం.. కమల్‌ హాసన్‌ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో తెలుసా?  

Also Read: Singer KK: సింగర్ కేకే హోటల్ గదిలో యాంటాసిడ్స్‌.. లైవ్ షోకి ముందు భార్యకు ఫోన్ చేసి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News