Ante Sundaraniki Teaser: 'అంటే సుందరానికీ!' మూవీ టీజర్ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Ante Sundaraniki Teaser: నాని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికీ!' నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీని జూన్ 10న విడుదల చేసేందుకు సిద్ధమైన చిత్రబృందం.. ఇప్పుడు సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 12:07 PM IST
Ante Sundaraniki Teaser: 'అంటే సుందరానికీ!' మూవీ టీజర్ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Ante Sundaraniki Teaser: నేచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా ఫాజిల్ కలిసి నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ!'. ఈ మూవీని జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. ఇప్పటికే సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

'అంటే సుందరానికీ!' మూవీ టీజర్ ను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్లు నాని, నజ్రియా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇటీవలే నాని పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. 

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా ఫాజిల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ యర్నేనేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.   

Also Read: Chiranjeevi Acharya: స్టెప్పులతో ఇరగదీసిన చిరు- చరణ్‌.. 'భలే భలే బంజారా' సాంగ్ ప్రోమో అదుర్స్

Also Read: Esha Gupta Photos: హాట్ హాట్ అందాలతో పిచ్చేక్కిస్తోన్న రామ్ చరణ్ హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News