Annayyaa Annayyaa lyrical song: పెద్దన్న మూవీ నుంచి అదుర్స్ అనిపించేలా అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్

Annayyaa Annayyaa lyrical song: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న పెద్దన్న మూవీ నుంచి అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్ విడుదలై సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.

Last Updated : Oct 31, 2021, 06:33 AM IST
Annayyaa Annayyaa lyrical song: పెద్దన్న మూవీ నుంచి అదుర్స్ అనిపించేలా అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్

Annayyaa Annayyaa lyrical song: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న పెద్దన్న మూవీ నుంచి అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్ విడుదలై సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. రజినీకాంత్ సరసన నయనతార, కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా కూడా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 

 

''అన్నయ్యా.. అన్నయ్యా..'' అంటూ సాగిన ఈ పాటకు ఫేమస్ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి రచించగా ఎస్పీ చరణ్ అద్భుతంగా పాడాడు. డి ఇమ్మాన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బాగుంది. తమిళంలో అన్నాత్తె అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను మేకర్స్ తెలుగులో పెద్దన్న పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. నవంబర్ 4వ తేదీన దీపావళి కానుకగా పెద్దన్న మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.

Trending News