NBK 108 : మళ్లీ మీకు సపరేట్‌గా అవసరమా?.. బ్రహ్మాజీపై అనిల్ రావిపూడి సెటైర్

Anil Ravipudi Satire on Brahmaji అనిల్ రావిపూడి తాజాగా నటుడు బ్రహ్మాజీ మీద కౌంటర్లు వేశాడు. బాలయ్యతో తాను చేయబోతోన్న సినిమాలో బ్రహ్మాజీకి స్పెషల్ రోల్ ఇచ్చినట్టున్నాడు. దీంతో బ్రహ్మాజీ సెట్స్ మీదకు వచ్చాడు. వచ్చీ రావడంతో బ్రహ్మాజీ కామెడీ చేసేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 07:59 AM IST
  • నెట్టింట్లో బ్రహ్మాజీ సందడి
  • ట్వీట్లతో కమెడియన్ హల్చల్
  • కౌంటర్ వేసిన అనిల్ రావిపూడి
NBK 108 : మళ్లీ మీకు సపరేట్‌గా అవసరమా?.. బ్రహ్మాజీపై అనిల్ రావిపూడి సెటైర్

Brahmaji in NBK 108 అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ఎఫ్ 3 మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కాకుండా.. అతి కామెడీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. అది అసలు కామెడీనా? అంటూ అందరూ తిట్టి పోశారు. ఇక వంద కోట్ల పోస్టర్ వేసుకోవడం కూడా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.

బ్రహ్మాజీ లేకుండా అసలు సినిమాలే రావడం లేదు. ఈ మధ్య అన్ని సినిమాల్లోనూ ఆయన ఉంటున్నాడు. కామెడీ, సైడ్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాలుగా మెప్పిస్తున్నారు. సీరియల్ పాత్రలు చేస్తూనే కామెడీ రోల్స్ కూడా పోషిస్తున్నాడు. అలా బ్రహ్మాజీ నటించిన సినిమాలు దాదాపుగా హిట్ అవుతున్నాయి. ఇక కొత్త దర్శకులు ఆయన్ను సినిమాలో పెట్టుకుంటే సక్సెస్ వచ్చినట్టే అన్నట్టుగా మారుతోంది.

 

ఇక సోషల్ మీడియాలోనూ బ్రహ్మాజీ నవ్వులు పూయిస్తుంటాడు. బ్రహ్మాజీ వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. బ్రహ్మాజీ మీద అప్పుడప్పుడూ ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. తాజాగా బ్రహ్మాజీ ఓ ట్వీట్ వేశాడు. తాను NBK 108 సెట్‌లో అడుగు పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ గారు మీరు కూడా ఆన్ బోర్డ్ ఏ.. మాకు వెల్కమ్ లేదా?.. నా పాన్ ఇండియన్ ఫ్యాన్స్‌కు ఇదే నా గ్లింప్స్ అంటూ ట్వీట్‌తో పాటుగా వీడియోను షేర్ చేశాడు.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

ఆ వీడియోలో కారులోంచి బ్రహ్మాజీ దిగాడు. ఇక అనిల్ రావిపూడి కాళ్ల మీద పడి మొక్కుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఏ నా కాళ్ల మీద ఎందుకు పడుతున్నావ్.. నువ్ పెద్దోడివి అంటూ.. అనిల్ రావిపూడి అంటాడు. షూ ఏ బ్రాండ్ అని చూస్తున్నా అని బ్రహ్మాజీ కవర్ చేస్తాడు. ఇక బ్రహ్మాజీ ట్వీట్‌కు అనిల్ రావిపూడి ఇలా రిప్లై ఇచ్చాడు. ఏ స్క్రిప్ట్ అయినా ఆఫీస్ బోర్డు మీద ఉన్నపుడే మీరు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్  లో వుంటారు.. మళ్ళీ మీకు సెపరేట్ గా ఆన్ బోర్డ్‌లు అవసరమా  బ్రహ్మాజీ గారు అని ట్వీట్ వేశాడు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News