Anchor Varshini : స్నానం చేస్తుంటే.. బాత్రూంలో అది ఉండాల్సిందేనట.. సీక్రెట్ చెప్పేసిన యాంకర్ వర్షిణి

Anchor Varshini Funny Habit యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య మాత్రం వర్షిణి ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఎక్కువ సైలెంట్‌గా ఆమె కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 09:25 AM IST
  • బుల్లితెరపై కనిపించిన గ్లామరస్ బ్యూటీ
  • యాంకర్‌గా అవకాశాలు కోల్పోయిన వర్షిణి
  • సోషల్ మీడియాలో వర్షిణి సౌందరాజన్ సందడి
Anchor Varshini : స్నానం చేస్తుంటే.. బాత్రూంలో అది ఉండాల్సిందేనట.. సీక్రెట్ చెప్పేసిన యాంకర్ వర్షిణి

Anchor Varshini Funny Habit బుల్లితెరపై యాంకర్‌గా వర్షిణికి మంచి క్రేజ్ వచ్చింది. ఒకానొక సమయంలో ఆది వర్షిణి మధ్య కుదిరిన కెమిస్ట్రీకి సోషల్ మీడియాలో పెళ్లి రూమర్లు కూడా వచ్చాయి. ఆది వర్షిణిలు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని యూట్యూబ్‌లో కుప్పులు తెప్పలుగా రూమర్లు వచ్చాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమేనని క్లారిటీగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు వర్షిణి అయితే బుల్లితెరకు దూరంగానే ఉంటుంది.

ఢీ షో నుంచి ఆమెను తీసేసి తరువాత కామెడీ స్టార్స్ అనే షోలో కనిపించింది వర్షిణి. ఆ షోతోనే వర్షిణి సోలో యాంకర్‌గా నిలబడింది. అయితే ఆ షోను కూడా ఎక్కువ రోజులు చేయలేకపోయింది వర్షిణి. సినిమా ఆఫర్లు వస్తున్నాయని బుల్లితెరను వదిలేసింది. అదే ఆమె చేసిన తప్పులా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె చేతిలో ఎక్కువగా సినిమాలు లేవు. బుల్లితెర ఆఫర్లు కూడా లేకుండా పోయాయి.

సుమంత్‌తో చేసిన మళ్లీ మొదలైంది సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సమంతతో చేసిన శాకుంతలం సినిమాలోనూ వర్షిణి నటించింది. కానీ ఇంత వరకు ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. విడుదలైనా ఆ సినిమా వర్షిణికి యూజ్ అవుతుందో లేదో చెప్పలేం. ఇక ఇప్పుడు ఆమె చేతిలో ఒక సినిమా ఉంది. శివ కందుకూరి హీరోగా రాబోతోన్న సినిమాలో వర్షిణి నటిస్తోంది.

ఇప్పుడు వర్షిణి సోషల్ మీడియాలో సందడి చేయడం ప్రారంభించింది. గత వారమే వర్షిణి పొట్టి బట్టల్లో కనిపించి మెప్పించింది. బుల్లి బట్టల్లో కనిపించి అభిమానులను అలరించింది. ఇప్పుడు వర్షిణి చేసిన ఓ ఫన్నీ పోస్ట్ అందరినీ నవ్విస్తోంది. మామూలుగా అందరూ బాత్రూం సింగర్లుగా మారుతుంటారు కొన్ని సందర్భాల్లో.

కొందరు స్నానం చేస్తుండగా.. పాటలు పాడుతుంటారు. ఇంకొందరు పాటలు వింటారు. అలా వర్షిణికి స్నానం చేస్తుండగా.. బాత్రూంలో స్పీకర్లు ఉండాల్సిందేనట. ఈ విషయాన్ని చెప్పేలా ఓ మీమ్‌ను వర్షిణి షేర్ చేసింది. బాత్రూంలో స్నానం చేసేందుకు వెళ్తే ఇలా స్పీకర్ పట్టుకెళ్తానంటూ చెప్పేసింది.

Also Read:  Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత

Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News