Suma Accident Video: ప్రముఖ టీవీ యాంకర్ సుమకు పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదం జరిగింది ఇప్పుడు కాకపోయినా..వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.
చాలా సందర్భాల్లో వీడియో లేదా ఫోటో వైరల్ అయిన తరువాతే ఆయా ఘటనల గురించి తెలుస్తుంటుంది. లేదా ఆ ఘటన ప్రాధాన్యత అర్ధమౌతుంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగే కొద్దీ వీడియోలు లేదా ఫోటోలు వైరల్ అయ్యే కొద్ది వివిధ ఘటనలు ప్రాధాన్యత సంతరించుకుంటుంటాయి. అదే జరిగింది ప్రముఖ టీవీ యాంకర్ సుమ.
యాంకర్ సుమకు ప్రమాదం జరిగిందని..తృటిలో విపత్తు తప్పిందంటూ ఓ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. యాంకర్ సుమకు ప్రమాదం తప్పింది నిజమే కానీ ఆ ప్రమాదం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. ఎప్పుడో జరిగింది. సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయితీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మే 6వతేదీన విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. శ్రీకాకుళం నేపధ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ అటవీ ప్రాంతంలోని చిన్న నీటి ప్రవాహం వద్ద సుమ నిలుచుని ఉంది. అక్కడున్న రాళ్లకు నాచు పట్టిం ఉండటంతో ఒక్కసారిగా కాలు జారి పడిపోయింది. అయితే అలా జారినప్పుడు ఆమె తలభాగం వెనక్కి రాళ్లకు తగిలుంటే పెను ప్రమాదమే జరిగుండేది. కానీ సుమ కంట్రోల్ చేసుకోవడంతో అలాగే రాళ్పపై బలంగా కూర్చుంది. ఈ వీడియోను సుమ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఎక్కౌంట్లో షేర్ చేస్తూ.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ రాసుకొచ్చింది. ఎప్పుడో జరిగిన ఈ ప్రమాదపు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.