Anchor Ariyana: రాజ్ తరుణ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు: అరియానా

హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం 'అనుభవించు రాజా'. ఇటీవల ఈచిత్రం రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇందులో కీలకపాత్ర పోషించిన యాంకర్ అరియానా...రాజ్ తరుణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 06:15 PM IST
Anchor Ariyana: రాజ్ తరుణ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు: అరియానా

Anchor ariyana shocking comments on raj tarun: యువ నటుడు రాజ్ తరుణ్ పై బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ(Anchor Ariyana) సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఒకప్పుడు రాజ్ తరుణ్(Raj tarun) అంటే అసలు ఇష్టం ఉండేది కాదని ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 

ఇదిలా ఉంటే...రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా  చిత్రం 'అనుభవించు రాజా'(Anubhavinchu Raja). ఇందులో ఆరియానా  కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అరియానాతోపాటు హీరో, డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. 

Also Read: Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ.. తనకు ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదని.. తనతో సినిమా ఎలా చేశానో అర్థం కావట్లేదని తెలిపింది. టీవీలో తన సినిమాలు వస్తే తీసేయాలని చెప్పేదాన్ని అని.. ఒకరోజు రాజ్ తరుణ్ కారులో వెళ్తుంటే తనకు యాక్సిడెంట్ కావాలని కోరుకున్నట్లు పేర్కొంది. 

రాజ్ తరుణ్ అంటే అంత కోపం అని అడగ్గా..ఇలా ఒక ఇంటర్య్వుకు పిలిచి..చాలా సేపు వెయిట్ చేయించాడు.. నా ముందే కారులో వెళ్తుంటే హీరో ఏంటీ వెళ్లిపోతున్నాడని అడిగాను.. డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళ్తున్నట్లు చెప్పారని ఆరియానా చెప్పుకొచ్చింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా...బిగ్ బాస్(Bigg Boss) షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News