Anchor Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ కొత్త ప్రయత్నం

యాంకర్ అనసూయ పేరు అంటే టాలీవుడ్ సర్కిల్స్‌లో తెలియని వాళ్లు ఉండరు. ఓవైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ, మరోవైపు వెండితెరపై అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ ఆడియెన్స్ అందరికీ ఎప్పుడో సుపరిచితమైన యాంకర్ అనసూయ కొత్తగా కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది.

Last Updated : Dec 6, 2020, 09:15 AM IST
Anchor Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ కొత్త ప్రయత్నం

యాంకర్ అనసూయ పేరు అంటే టాలీవుడ్ సర్కిల్స్‌లో తెలియని వాళ్లు ఉండరు. ఓవైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ, మరోవైపు వెండితెరపై అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ ఆడియెన్స్ అందరికీ ఎప్పుడో సుపరిచితమైన యాంకర్ అనసూయ కొత్తగా కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అనసూయనే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. సిల్క్ స్మిత తరహాలో ఫోజిచ్చిన ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యాంకర్ అనసూయ కోలీవుడ్ లో కొత్త ప్రయాణాన్ని ఆరంభిస్తున్నట్టు అందులో పేర్కొంది.

అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ( Anchor Anasuya viral photo ) కాగా.. ఆమె చేయబోతున్న కోలీవుడ్ సినిమాపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అంతకంటే ఒక రోజు ముందుగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ( Vijay Sethupathi ) కలిసి ఉన్న ఫోటోను అనసూయ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

Also read : Anchor Anasuya: మరో కీలక పాత్రలో యాంకర్ అనసూయ

విజయ్ సేతుపతి సినిమాలో యాంకర్ అనసూయ ( Anchor Anasuya ) నటిస్తోందంటూ ఓ టాక్ వినిపించగా.. తాజాగా కోలీవుడ్ సినిమాకు సైన్ చేసినట్టు అనసూయ ప్రకటించడం ఆ టాక్‌కి మరింత బలం చేకూర్చినట్టయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News