మెగాపవర్‌స్టార్‌తో అనసూయ సెల్ఫీ..!

మెగాపవర్‌స్టార్‌తో అనసూయ సెల్ఫీ..!

Last Updated : Dec 24, 2017, 06:03 PM IST
మెగాపవర్‌స్టార్‌తో అనసూయ సెల్ఫీ..!

ఓ పక్క రియాల్టీ షోల్లో యాంకర్‌గా.. మరోపక్క క్యారెక్టర్ ఆరిస్టుగా సినిమాల్లో నటిస్తూ  ప్రేక్షకుల్లో తనకంటూ ఒక మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటి అనసూయ. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘రంగస్థలం’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో తన కొడుకుతో కలిసి మెగాపవర్ స్టార్‌తో సెల్ఫీ దిగారు అనసూయ.

ఆ ఫోటోని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘చాలా మంచి వ్యక్తైన రామ్‌చరణ్‌తో దిగిన సెల్ఫీను మీతో షేర్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది.  ‘రంగస్థలం’ సెట్స్‌లో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించిన తర్వాత మేము దిగిన సెల్ఫీ ఇది. ఆ సన్నివేశం ఏంటో సినిమా విడుదలయ్యాక మీరూ చూడండి.’ అని తన ట్వీట్‌లో చెప్పారు అనసూయ. ‘రంగస్థలం’ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత, రామ్‌ చరణ్‌ జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2018 మార్చిలో ఈ చిత్రం విడుదల అవుతుంది. 

 

Trending News