Anasuya Targets Devarakonda: ఇదేం పైత్యం..దేవరకొండపై అనసూయ సంచలన ట్వీట్!

Anasuya Bharadwaj Targets Vijay Devarakond: అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య జరిగిన వివాదం నేపధ్యంలో ఎప్పటికప్పుడు అనసూయ ఆయనని పరోక్షంగా విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు అనసూయ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 5, 2023, 09:53 PM IST
Anasuya Targets Devarakonda: ఇదేం పైత్యం..దేవరకొండపై అనసూయ సంచలన ట్వీట్!

Anasuya Bharadwaj Targets Vijay Devarakonda again: గతంలో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య జరిగిన వివాదం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అప్పటి ప్రమోషన్స్, మాదర్ ** అనే బూతు పదం మీద అనసూయ భరద్వాజ్ బహిరంగంగానే విమర్శలు చేసింది. విజయ్ దేవరకొండ కూడా అనసూయ భరద్వాజ్ మీద పరోక్షంగా కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ మధ్యకాలంలో లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న తర్వాత బాగా జరిగింది అమ్మని తిట్టిన వాళ్ళు ఎవరో బాగుపడలేదు అని అర్థం వచ్చేలా అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు కూడా అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ ను ప్రస్తావిస్తూ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా ప్రస్తుతానికి ఖుషి అనే సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా రిలీజ్ నీ గ్రాండ్ గా ప్లాన్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది.

Also Read: Naga chaitanya: సమంత చాలా మంచిది.. 'ఆమె'ను అగౌరవపరుస్తున్నారు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

కాశ్మీర్ నేపథ్యంలోని ఒక అందమైన ప్రేమ కథగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి సాంగ్ మే తొమ్మిదో తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఒక స్పెషల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో నా రోజా నువ్వే అనే పాట రిలీజ్ చేస్తున్నామని అదే పాటను తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

అంతా బాగానే ఉంది కానీ ఈ ఖుషి టైటిల్ పోస్టర్లో విజయ్ దేవరకొండ ముందు ది విజయ్ దేవరకొండ అని పేర్కొనడం ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కంట్లో పడినట్లు ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేసింది. నిజానికి ఈ ‘ది’ అనే పదాన్ని యూనిక్ విషయాలకు, వస్తువులకు మాత్రమే వాడుతూ ఉంటారు అంటే విజయ్ దేవరకొండ యూనిక్ అని అర్థం వచ్చేలా ఇలా పేరు ముందు ఈ ‘ది’ పదాన్ని యాడ్ చేశారని ప్రచారం జరుగుతోంది.

చాలా మంది విజయ్ దేవరకొండ అతి చేస్తున్నాడని అమితాబచ్చన్, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వాళ్లే ఎప్పుడూ ఇలాంటి పదాలు వాడుకోలేదు కానీ చేసిన నాలుగు సినిమాలకే ఇలాంటి పేర్లు పెట్టుకోవడం ఏంటి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక అనసూయ భరద్వాజ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడే ఒకటి చూశాను ‘దీ’నా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది. ఇక్కడ విజయ్ దేవరకొండ గురించి ఆమె ప్రస్తావించకపోయినా ‘ది’ అనే పదాన్ని ప్రస్తావించడం వల్ల ఆమె విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుతానని అందరూ భావిస్తున్నారు.

Also Read: Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News