Baby Movie: మరో రెండుభాషల్లో బేబీ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

Baby Movie Remake: గత సంవత్సరం చిన్న సినిమాగా వచ్చి తెలుగులో పెద్ద విజయం సాధించిన చిత్రం బేబీ. అత్యంత తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని ఇండస్ట్రీలో చూపు ఈ చిత్రంపై పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 02:46 PM IST
Baby Movie: మరో రెండుభాషల్లో బేబీ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

Baby Movie in Bollywood: ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన సినిమా బేబీ. ఎస్ కే ఎన్ ప్రొడక్షన్లో, సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గత సంవత్సరం సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. యువత ఈ సినిమాకి ఫిదా అవడంతో ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకు పైగా సాధించింది. 

కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లు సంపాదించింది. అంతే ఈ చిత్రం పది రెట్లు ఎక్కువగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పక్క ఇండస్ట్రీల చూపు సైతం ఈ సినిమా రీమేక్ రైట్స్ పైన పడ్డాయి.

ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని గతంలోనే ప్రకటించారు. అంతేకాకుండా ఆ సినిమా తో స్టార్ హీరో కొడుకు పరిచయం అవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం హిందీలోనే కాకుండా మరో భాషల్లో కూడా అవుతున్నట్టు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. తాజాగా నిర్మాత SKN ట్రూ లవర్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆ సినిమా గురించి మాట్లాడిన అనంతరం బేబీ సినిమా గురించి మాట్లాడారు.

‘బేబీ  బాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా రీమేక్ చేయబోతున్నాం. బాలీవుడ్ బేబీ రీమేక్ అప్డేట్ ఈ వాలెంటైన్స్ డేకి ఇస్తాం' అని చెప్పుకొచ్చాడు. దీంతో బాలీవుడ్ లో ఈ సినిమా ఎవరు చేయబోతున్నారో అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు తమిళంలో సైతం ఈ సినిమా ఏ హీరో చెంతకు చేరుతుంది అనే ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ఈ సినిమాని ఆ రెండు భాషలలో కూడా సాయి రాజేష్ దర్శకత్వం వహించగా SKN నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. మరి ఇక్కడ భారీ హిట్ కొట్టిన బేబీ హిందీ, తమిళ్ లో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో తెలియాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్‌ కాస్కో అంటూ సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు

Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News