American Rapper Aaron Carter Death : అమెరికన్ ర్యాపర్ అరోన్ కార్టర్ (34) శనివారం తుదిశ్వాస విడిచాడు. అరోన్ బాత్ టబ్బులో విగతజీవిగా కనిపించాడని అతని సోదరుడు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందడం, ఆ తరువాత బాడీని పరిశీలించడం జరిగింది. అరోన్ మేనేజర్ మాత్రం వెంటనే స్పందించలేదని తెలుస్తోంది. అయితే అరోన్ కార్టర్ మాత్రం కుటుంబ కలహాల వల్లే మరణించి ఉంటాడని తెలుస్తోంది.
అరోన్‌ది పెద్ద ఫ్యామిలీ. ఐదుగురు అన్నదమ్ములున్నారు. డబ్బు కోసం గొడవ జరిగి ఉంటుందని ఆ తరువాత ఇలా జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరోన్.. ప్రొఫెషనల్ కెరీర్ బాగానే ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. మధ్యలో హాస్పిటల్‌లో చేరడం, ఆ తరువాత పునరావాస కేంద్రంలో కొన్ని రోజులు ఉండటం, బ్యాంక్ కేసులతో అరోన్ చాలా ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ కేసులు కూడా ఉన్నాయి. 2017లో మొదటి సారిగా అరోన్ తన పర్సనల్ విషయాలు, కేసులు, వ్యాధుల మీద స్పందించాడు. డ్రగ్స్ వాడాడంటూ వచ్చిన రూమర్ల మీద స్పందించాడు. డ్రగ్స్ వాడకం నుంచి బయటపడాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు.
Also Read : Alia Bhatt Blessed with Baby Girl : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్.. ఆనందంలో రణ్‌బీర్ కపూర్
Also Read : Janhvi Kapoor Mili Collection : జాన్వీ కపూర్‌కు ఘోర పరాభవం.. మరీ అంత తక్కువ కలెక్షనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook