Manchu Lakshmi : మంచు లక్ష్మి కి ముద్దు పెట్టేసిన అల్లు శిరీష్.. ఫోటో వైరల్..

Allu Sirish : దీపావళి పార్టీలో అల్లు శిరీష్, మంచు లక్ష్మీ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మంచు లక్ష్మి కి ముద్దు పేరుతో అల్లు శిరీష్ కనిపించడం విశేషం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2023, 05:08 PM IST
Manchu Lakshmi : మంచు లక్ష్మి కి ముద్దు పెట్టేసిన అల్లు శిరీష్.. ఫోటో వైరల్..

Viral Pic: మోహన్ బాబు గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏదన్న ముక్కుసూటిగా చెప్పే నటులలో ఆయన ఒకరు. అంతేకాదు ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేసేస్తారు మోహన్ బాబు. అలాంటి మోహన్ బాబు వారసత్వం పునికి పుచ్చుకుంది ఆయన కూతురు మంచు లక్ష్మి. అందుకే మోహన్ బాబు తన కొడుకుల కన్నా ఎక్కువ కూతురు గురించే మాట్లాడుతూ ఉంటారు. తన టాక్ షో లతో బాగా ఫేమస్ అయిన మంచి లక్ష్మి ఆ తరువాత సినిమాలలో హీరోయిన్ గా ..అలానే నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా కనిపించి మెప్పించింది.

ఇక సినిమా ఇండస్ట్రీలో అందరితో బాగా కలిసిపోతూ ఉంటుంది లక్ష్మి. కాగా మోహన్ బాబుకి, చిరంజీవికి మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అని రకరకాల వార్తలు ఎన్నోసార్లు షికార్లు చేశాయి. ఇందుకు తగ్గట్టే కొన్ని ప్రోగ్రామ్స్ లో వీరిద్దరి స్పీచ్ లో కూడా తేడా కనిపించింది. అయితే వీరిద్దరి మధ్య ఏమున్నా కానీ వీరి పిల్లలు మాత్రం కలిసే కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనోజ్,  మంచు లక్ష్మీ లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో మెగా హీరోల గురించి పాజిటివ్ గానే పెడుతూ ఉంటారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

 

ఈ నేపథ్యంలో మొన్న దీవాలి రోజు రామ్ చరణ్ దీపావళి పార్టీ ఇవ్వగా.. ఆ పార్టీకి లక్ష్మీ మంచు కూడా అటెండ్ అయింది. ఆ ఈవెంట్ లో ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ ఫొటోస్ లో మంచు లక్ష్మి.. రామ్ చరణ్ తో వెంకటేష్ తో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. కాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఒక ఫోటో. ఇంతకు అదేమిటి అంటే అల్లు శిరీష్ మంచు లక్ష్మి బుగ్గ పైన ముద్దు పెట్టే ఫోటో.

అవును మీరు విన్నది కరెక్టే. ఒక ఫోటోలో అల్లు శిరీష్ మంచు లక్ష్మి బుగ్గ పైన ముద్దు పెడుతూ కనిపించారు. ఇక ఆ ఫోటోని కూడా మంచు లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఇక ఈ ఫోటో చూసిన వారందరూ అల్లు హీరో మంచు లక్ష్మికి ముద్దు పెట్టేసారు అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అంతేకాదు ఈ ఫోటో కూడా ప్రస్తుతం తెగ వైరల్ అయిపోతుంది.

మొత్తానికి లోపల ఎన్ని విభేదాలు ఉన్నాయో తెలియని కానీ బయటకి మాత్రం మంచు ఫ్యామిలీ ..మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ వారు ఒకరితో ఒకరు బాగానే కలిసి ఉన్నారు అనిపిస్తోంది. నిజంగానే ఈ తరం వారంతా ఇలానే కలిసి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉంటే ఫ్యాన్ కి ఇంతకన్నా కావాల్సింది ఏమి ఉంటుంది.

Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 

Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

Trending News