అల్లుఅర్జున్‌ పుష్ప నుంచి మాస్ సాంగ్.. ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా ఫుల్ సాంగ్ వచ్చేసింది

Pushpa Fourth Single song : ఈ మూవీ నుంచి ఇప్పటికే మూడు లిరికల్‌ పాటలు వచ్చాయి. తాజాగా మరో మాస్ సాంగ్ వచ్చేసింది. ఏయ్‌ బిడ్డా.. ఇది నా.. అడ్డా.. అంటూ సాగే మాస్‌ సాంగ్ ను బాలీవుడ్‌ సింగర్‌ నాకాశ్‌ అజీజ్‌ పాడారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్‌ పాత్రను తెలియజేసేలా ఉంది ఈ పాట. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 01:45 PM IST
  • అల్లు అర్జున్‌ తాజా మూవీ పుష్ప నుంచి మరో మాస్ సాంగ్
  • క్రిస్మస్‌ కానుకగా బన్నీ.. పుష్ప మూవీ రిలీజ్
  • ఇప్పటికే విడుదలైన మూడు లిరికల్‌ పాటలకు మంచి ఆదరణ
  • తాజాగా మరో మాస్ సాంగ్ ఏయ్‌ బిడ్డా.. ఇది నా.. అడ్డా.. రిలీజ్‌
అల్లుఅర్జున్‌ పుష్ప నుంచి మాస్ సాంగ్.. ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా ఫుల్ సాంగ్ వచ్చేసింది

Allu Arjun’s Pushpa The Rise Part 1 Song Eyy Bidda Idhi Naa Adda Lyrical Song out now: అల్లు అర్జున్‌ తాజా మూవీ పుష్ప. సుకుమార్‌ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా ఈ బన్నీ.. పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే మూడు లిరికల్‌ పాటలు (Three lyrical songs) వచ్చాయి. తాజాగా మరో మాస్ సాంగ్ (Mass Song) వచ్చేసింది. ఏయ్‌ బిడ్డా.. ఇది నా.. అడ్డా.. (Eyy Bidda Idhi Naa Adda) అంటూ సాగే మాస్‌ సాంగ్ ను బాలీవుడ్‌ సింగర్‌ నాకాశ్‌ అజీజ్‌ పాడారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్‌ పాత్రను తెలియజేసేలా ఉంది ఈ పాట. ఇక ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్ అందించారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ దుమ్ములేపారు. ఈ పాటలో అల్లు అర్జున్‌ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టుతో ఊర మాస్‌ లుక్‌లో అదరగొట్టారు.

ఇక పుష్ప (Pushpa) మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగాన్ని కూడా పెంచారు మేకర్స్‌. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన దాక్కో దక్కో మేక, చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే... సామీ సామీ పాటలకు ఒక రేంజ్‌లో ఆదరణ లభించింది.

 

Also Read : వావ్: గూగుల్‌ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్

ఎర్రచందనం స్మగ్లింగ్ (Red sandalwood smuggling) నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోంది. అలాగే సమంత ఈ మూవీలో స్పెషల్‌సాంగ్‌లో కనిపింనుందని టాక్. దీంతో ఈ మూవీపై (Movie) మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తొలి పార్ట్‌ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read : అనంతపురం జిల్లా అతలాకుతలం.. చిత్రావతి నదిలో చిక్కుకున్న 8 మంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News