Pushpa makers returned money: పుష్ప మూవీకి అక్కడ భారీ దెబ్బ.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తోన్న మూవీ మేకర్స్

Pushpa movie makers returned money to distributors : పుష్ప మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బు తిరిగి ఇచ్చేస్తోన్న ప్రొడ్యూసర్స్. నెమ్మదిగా మూవీ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్న మూవీ మేకర్స్.

Last Updated : Jan 7, 2022, 10:29 PM IST
  • నెమ్మదిగా తగ్గినా పుష్ప మూవీ కలెక్షన్స్
  • నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌ను ఆదుకుంటోన్న మైత్రి మూవీ మేకర్స్
  • దాదాపు 50శాతం దాకా డబ్బులను వెనక్కి ఇచ్చిసిన మూవీ మేకర్స్
Pushpa makers returned money: పుష్ప మూవీకి అక్కడ భారీ దెబ్బ.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తోన్న మూవీ మేకర్స్

Allu Arjun's pushpa movie makers returned money to distributors : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రిలీజైన మూవీ పుష్ప. డిసెంబర్ 17న రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ. 300 కోట్లకు పైనే గ్రాస్ వసూలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా పుష్ప మూవీకి మంచి వసూళ్లు వచ్చాయి. హిందీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది పుష్ప మూవీ. (pushpa movie) నెమ్మదిగా పుష్ప మూవీ (pushpa movie) కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. తెలుగులో కలెక్షన్స్ కాస్త తగ్గినా.. ఇతర భాషల్లో మాత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఈ మూవీని దాదాపు రూ.102 కోట్లకు అమ్మారు నిర్మాతలు. నైజాంలో (Nizam) సినిమాకు నష్టాలు రాలేదు... అలాగే లాభాలు కూడా పెద్దగా రాలేదు. అయితే ఏపీలో (AP) మాత్రం పుష్ప మూవీకి పెద్ద దెబ్బే తగిలింది. ఇక ఈ రోజు పుష్ప మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది.

 

ఏపీలో టికెట్ రేట్స్ (Ticket rates) భారీగా తగ్గడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై పడింది. దీంతో ఏపీలోని డిస్ట్రిబ్యూటర్స్‌కు (Distributors‌) మూవీ ప్రొడ్యూసర్స్ డబ్బు వెనక్కి ఇచ్చివేస్తున్నారు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌ను ఆదుకోవడంలో మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చారు.

Also Read : Corona in India: దేశంలో కరోనా ఉగ్రరూపం- వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..

యూఏ, ఈస్ట్, గుంటూరు ఏరియాల్లో పుష్ప మూవీ మేకర్స్ (Mythri Movie Makers) డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇప్పటికే రూ.8 కోట్లకు పైనే తిరిగి ఇచ్చేశారట. ఈ డిస్ట్రిబ్యూటర్స్‌కు దాదాపు 50శాతం దాకా డబ్బులను వెనక్కి ఇచ్చేశారట. ఇక నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల్లో ఇప్పటికే పుష్ప మూవీకి (pushpa movie) 80 శాతం కలెక్షన్స్ రావడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అసవరం రాలేదు.

Also Read :Corona in Telangana: తెలంగాణలో కొవిడ్ కల్లోలం- ఒక్క రోజులో 2 వేలపైకి కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News