Allu Arjun: అల్లు అర్జున్ కు అరుదైన అవార్డు.. టాలీవుడ్ నుంచి మొదటి నటుడు ఆయనే!

Allu Arjun Recieves Leading Man Award : అల్లు అర్జున్ ఖాతాలో మరొక ప్రతిష్టాత్మక అవార్డు కూడా వచ్చి చేరింది, ఆయన లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్నారు, జీక్యూ మ్యాగజైన్ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అల్లు అర్జున్ అందుకున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

Last Updated : Dec 14, 2022, 09:55 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ కు అరుదైన అవార్డు.. టాలీవుడ్ నుంచి మొదటి నటుడు ఆయనే!

Allu Arjun Recieves Leading Man Award : ఒక రకంగా ఏడాది అల్లు అర్జున్ కి గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. 2021 చివరిలో పుష్ప పార్ట్ వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ ఏడాది మొత్తం ఆ క్రేజ్ ఎంజాయ్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పుష్ప సినిమాకి గాను ఈ ఏడాది ఫిలింఫేర్, సైమా అవార్డులు కూడా అందుకున్న ఆయన మరో సినిమా కూడా చేయకుండానే అనేక యాడ్ ఫిలిమ్స్ చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అల్లు అర్జున్ ఖాతాలో మరొక ప్రతిష్టాత్మక అవార్డు కూడా వచ్చి చేరింది. అల్లు అర్జున్ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్నారు, జీక్యూ మ్యాగజైన్ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అల్లు అర్జున్ అందుకున్నాడు. రెండు రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత గోప్యంగా జరిగిన ఈ వేడుకల్లో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ఫ్యాషన్, కల్చర్, పాలిటిక్స్ వంటి విభాగాలకు గాను అందజేస్తారు.

ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. ఇక ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో మరిన్ని ట్విస్టులు యాడ్ చేశారని ఒక రేంజ్ లో ఈ సెకండ్ పార్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక ఈ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఆయన జి క్యు ఇండియాకి థాంక్స్ చెబుతూ నన్ను లీడింగ్ మ్యాన్ ఆఫ్ 20 22 గా ఎన్నుకొని సత్కరించినందుకు థాంక్స్ చెప్పారు. కవర్ మీద నేను ఉండటం చాలా ప్లెజర్ లా ఉందని నా లిస్టులో ఉన్న టార్గెట్స్ లో ఒక టార్గెట్ అఛీవ్ అయ్యానని, ఈ సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు. అంతేగాక అవార్డు అందుకుంటున్న ఫోటోలు సైతం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: Manchu Lakshmi: మంచో చెడో పవన్ పక్కనుంటే బాగుందన్న మంచు లక్ష్మీ.. దారుణంగా ఆడుకుంటున్న ఫాన్స్!

Also Read: Udhayanidhi Stalin: సినిమాలకు గుడ్ బై చెప్పిన ఉదయనిధి స్టాలిన్..మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ప్రకటన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News