Pushpa 2 Sandhya Theatre Controversy : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఎఫెక్ట్ కారణంగా మిగతా సినిమాలపై వేటు పడిందనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా పుష్ప -2 సినిమా విడుదలకు సంబంధించి బెనిఫిట్ షోలు వేయగా.. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి విచ్చేశారు. హైదరాబాదులో సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సందడి చేయడంతో ఆయనను చూడడానికి అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది
ఆ తొక్కిసలాటలో 39 ఏళ్ల రోహిణి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత నెలకొంటోంది. ఇక ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇకపై బెనిఫిట్ షో లకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. కాగా ఈ థియేటర్లో బెనిఫిట్ షో వీక్షించేందుకు అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు ప్రేక్షకులు భారీగా తొక్కిసలాట నిర్వహించారు. ఆ తొక్కిసలాటలో మహిళా చనిపోయింది
ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే మంత్రి ఈ నిర్ణయం తీసుకోవడంతో పుష్ప -2 అలాగే అల్లు అర్జున్ పై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అసలు కట్టుదిట్టమైన భద్రత లేకుండా ఎలా థియేటర్ కి వెళ్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప -2 గత మూడు ఏళ్లుగా యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంది. తన అభిమానుల మధ్య సినిమా చూడాలనుకున్న అల్లు అర్జున్ కి ఇప్పుడు అసలు చిక్కు వచ్చి పడింది. మొత్తానికి అయితే ఈయన కారణంగా బెనిఫిట్ షోలు మొత్తం రద్దడంతో నిర్మాతలు ఫైర్ అవుతున్నారు.
Also Read: Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన దేవర 'డ్యాన్సర్'.. తనను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు
Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.