Allu Arjun _ Pushpa 2: 'పుష్ప 2' కోసం సుకుమార్ సూపర్ స్కెచ్.. అల్లు అర్జున్‌ ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ హీరో..

Allu Arjun - Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ హీరోను తీసుకుంటున్నారట.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 4, 2024, 02:38 PM IST
Allu Arjun _ Pushpa 2: 'పుష్ప 2' కోసం సుకుమార్ సూపర్ స్కెచ్.. అల్లు అర్జున్‌ ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ హీరో..

Allu Arjun - Pushpa 2:  అల్లు అర్జున్ విషయానికొస్తే.. ఈయన సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు.  అంతేకాదు ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు హిందీలో మరింత హైప్ తీసుకురావడానికి సుకుమార్ మరో ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నాడట.

సంజూ బాబాది  ఈ సినిమాలో నెగిటివ్ కాకుండా.. పాజిటివ్ పాత్ర అని చెబుతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్.. సౌత్‌లో 'కేజీఎఫ్ 2', బీస్ట్ మూవీలతో పలకరించారు. త్వరలో 'డబుల్ ఇస్మార్ట్' సినిమాతో పలకరించారు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2'లో కూడా నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు పుష్ప 2 మూవీలో ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అయాన్ పై కొన్ని సీన్స్‌ను టెస్ట్ షూట్ చేసి సుకుమార్ ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణను పరిచయం చేసిన సుకుమార్.. ఇపుడు పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ కుమారుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడమే తరువాయి.

అటు సుకుమార్ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగాలతో పాటు, సురేందర్ రెడ్డితో రేసుగుర్రం 2 మూవీలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

Also read: Ycp vs Prashant kishor: ఎన్ని పీకేలొచ్చినా పీకేదేం లేదు, ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్న వైసీపీ నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News